Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేనకు మద్దతుగా బన్నీ,వరుణ్ తేజ్ ప్రచారం..నాగబాబు సతీమణి పద్మజా వెల్లడి .

Category : state politics

రానున్న ఏపీ ఎన్నికలు ఒక్కింత యుద్ధ వాతావరణాన్నేతలపిస్తున్నాయి.ఇప్పటికే ఆయా పార్టీ కీలక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తనకు కావలిసిన రాజకీయ పార్టీలకు మద్దతు గా సినీ, రాజకీయ ప్రముఖులు విస్తృత ప్రచారం మొదలు పెడుతున్నారు.ఈ సందర్భంలోనే గత కొంత కాలంగా జనసేన పార్టీ కి మద్దతు గా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారంలో పాలుపంచు కుంటారా ,లేదా అని ... అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అసలు అర్ధం కానీ పరిస్థితి.ముందే రాజకీయాలకు సినిమా రంగు పూసుకున్న పరిస్థితి.అందులో భాగంగానే పవన్ తరుపున మెగా ఫ్యామిలీ మద్దతు గనుక ఇస్తే ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటె నర్సాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంలోనే ఆయనకు మద్దతు గా ఆయన సతీమణి పద్మజా,కుమార్తె నీహారిక ఆయన తరుపున ప్రచారంలో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలోనే నాగబాబు సతీమణి పద్మజా ఓ సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ...పలు ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆమె చెప్పకనే చెప్పింది.ప్రజలంతా మార్పును కోరుకుంటున్నారని.అలాంటి మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడితోనే అది సాధ్యం అని. పవన్ మాటల మనిషి కాదని...చేతల మనిషి అంటూ ఆమె పేర్కొన్నారు.ఆయన సాధ్యమయ్యే పనులు మాత్రమే హామీ ఇస్తాడని.నమ్మిన పని కోసం,నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాడేతత్వం కళ్యాణ్ సొంతం అని ఆమె చెప్పుకొచ్చారు.ఈ సందర్భంలోనే ఆమె ఏపీ అధికార పార్టీ పని తీరు పై ఒక్కింత అసహనం వ్యక్తం చేసింది.పసుపు కుంకుమ పథకం కింద అమాయకుల ఓట్లను క్యాష్ చేసుకొవాలని చూస్తున్నారని.ఎన్నికల సమీపిస్తున్న వేళా మాత్రమే వాళ్ళకి ఈ పథకం గుర్తుకు వచ్చిందా అంతకుముందు ఏమైంది వాళ్ళ పథకం అంటూ ఆమె ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరుపున మెగాఫ్యామిలీ హీరోలు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు అని పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ .....ఈ ఎన్నికల్లో జనసేనకు మెగా ఫ్యామిలీ తరుపున పూర్తి మద్దతు ఉంటుంది అని .ఈ ప్రచారానికి అల్లు అర్జున్,వరుణ్ తేజ్ లు క్యాంపెయిన్ చేయ బోతున్నారని ఆమె తెలిపింది.ఈ వివరాల మేరకు వరుణ్ తేజ్ అమెరికాలో ఉండడం మూలాన ఈ నెల 5 న తాను ఇండియా వచ్చి ప్రచారం లో పాల్గొంటారని ఆమె చెప్పుకొచ్చారు .ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో తెలియనున్నాయి.ఇంకా వీరితో పాటు సాయి ధరమ్ తేజ్,అల్లు శిరీష్ లు సైతం ప్రచారానికి రానున్నట్టు తెలుస్తుంది.ఇదే విషయాన్ని నాగబాబు గారి సతీమణి పద్మజా గారు తెలియజేయడం విశేషం.అలాగే ఆమె మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలుస్తామని.ప్రచారంలో పాలుగొన్న ప్రతి చోట ప్రజల యెక్క స్పందన అద్భుతంగా ఉందని.అందరిలో నెలకొన్న ఒకే ఒక్క ప్రశ్న గెలిచాక ఇక్కడే ఉంటారా..లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారని ...గెలిచాక తప్పకుండ ఇక్కడే ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.పవన్ ఒక గొప్ప నాయకుడు అని. అతను ప్రజలకోసమే పుట్టాడా అని చాల సార్లు అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు

Related News