//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూలై 10న బడ్జెట్ సమావేశాలు !

Category : politics

ఏపీలోని కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ పైన తన కసరత్తును ప్రారంభించింది.బడ్జెట్ ఎలా ఉండాలి,మరియు అంచనాలు ఎలా సిద్ధం చేయాలన్న అంశంపై అన్ని శాఖల కార్యదర్శులు,హెచ్ఓడీలకు మార్గదర్శకాలు ఎప్పుడో జారీ అయ్యాయి.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ కాలపరిమితి వచ్చే నెలాఖరును ముగియనున్న నేపథ్యంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది.ఏపీ సీఎం జగన్‌తో కూడా ఆర్థికశాఖ అధికారులు పలు దఫాలుగా సమావేశమయ్యి చర్చలు జరిపారు.దీన్ని బట్టి ఏపీ బడ్జెట్ సమావేశాలు 26న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి

ఏయే రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలి? మరియు వైసీపీ ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలకు నిధుల సర్దుబాటు ఎలా? అనే తదితర అంశాలపై చర్చించారు.ఈ హామీల అమలుకు నిధుల సమీకరణ అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు.హామీల అమలు కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉండదని,శాఖలకు కేటాయించే నిధుల్లోనే వాటికి ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నందున బడ్జెట్ ప్రతిపాదనల సమయంలోనే స్పష్టంగా డిమాండ్లు రూపొందించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ కోరింది.మరియు ప్రతిపాదనలు వాస్తవాలకు దగ్గరగా ఉండేలా చూడాలన్నారు.అలాగే,ఇదివరకు జరిగిన ప్రగతి ఆధారంగా నిధుల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది.ఈ రోజు (19వ తేదీ) నుంచి 24వ వరకు ప్రతిపాదనలను పంపాలని ఆర్థిక శాఖ కోరింది

ఏపీ ప్రభుత్వం జూలై 10న బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుందని తెలుస్తోంది.లేదంటే 11న కూడా ప్రవేశపెట్టే అవకాశముంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ముందే 2.26 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను తయారు చేసి సభకు సమర్పించినా,నాలుగు నెలల కాలానికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందింది.జూలై 31న ఇది ముగియనుంది.ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో అలాగే ప్రాధాన్యాలు కూడా మారడంతో బడ్జెట్ స్వరూపం మారనుందని అందరూ భావిస్తున్నారు.ప్రస్తుతం సమర్పించే బడ్జెట్ గత ప్రభుత్వం సమర్పించిన 2.26 లక్షల కోట్ల బడ్జెట్ స్థాయికి చేరుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రెవెన్యూ రాబడి,కొత్త ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.