//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు...!

Category : politics

ఈ రోజు నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమౌతాయి . ఉదయం 8 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళ్లు అర్పిస్తారు . 8.15కి అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏపీ కేబినెట్‌ సమావేశం అవుతుంది .

తరువాత గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. 9.30కి ఉభయ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహాన్ మాట్లాడుతారు . 18 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది అని సమాచారం . 8న ఉదయం 11.౩౦ గంటలకి ఏపీ ఆర్థికమంత్రి యనమల రాయకృష్ణడు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 23న రాజ్యసభ ఎన్నికలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అనర్హత వేటు వేయాల్సిందేనని వైసీపీ నేత విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీలో చేరిన 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పీకర్‌ కోడెలకు వినతిపత్రం సమర్పించారు. అలాచేస్తేనే మా పార్టీ నేతలు అసెంబ్లీ లో అడుగుపెడతారు అని అయన చెప్పారు.