//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ్యవసాయానికి అనువైన బడ్జెట్ : యనమల

Category : politics

జైట్లీ బడ్జెట్ వ్యవసాయానికి అనువైనదిగా ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. అలాగే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా కూడా ఉందని తెలిపారు.

ఏపీకి సంబంధించిన అంశాలను బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్ స్పీచ్ వేరు బడ్జెట్‌లో ఉండే వివరాలు వేరని చెప్పారు. బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని, ప్రతీ స్కీమ్‌ను క్షుణ్ణంగా చదివితేనే తప్ప ఏ రాష్ట్రానికి ఏం వచ్చాయో తెలియదన్నారు.

కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే బెంగళూరు మెట్రో అంశాన్ని స్పీచ్‌లో ప్రస్తావించారని చెప్పారు. ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా కనబడుతుందన్నారు. దీని వల్ల ఏపీలోని ఎంఎస్ఎంఈలను పునరుద్దరించే అవకాశం లభిస్తుందని యనమల వ్యాఖ్యానించారు.

Related News