//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్ ఫై బీజేపీ ఎంపీల్లో కలవరం!

Category : politics

అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పై విపక్షాలే కాకుండా, తెలుగుదేశం వంటి మిత్రపక్షాలు కూడా పెదవి విరిచాయి. బడ్జెట్ లో ఏపీకి ఇచ్చింది ఏమీ లేదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే కామెంట్ చేశారు. మరోవిషయం ఏమిటంటే ఈ బడ్జెట్ బీజేపీ ఎంపీల్లో సైతం గుబులు రేపుతోంది.

మనది ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, ఈ చరిత్రాత్మక బడ్జెట్ గురించి వివరించండి అంటూ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ చెబుతున్నప్పుడు ఎంపీల్లో ఎలాంటి స్పందన కనిపించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మోదీ ఏది చెప్పినా ఉత్సాహంతో హర్షం వ్యక్తం చేసే ఎంపీలు బడ్జెట్ కు సంబంధించి మోదీ మాట్లాడుతున్నప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. బడ్జెట్ తర్వాత తమ ఎంపీల్లో అయోమయం పెరిగిపోయిందని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో కూడా అర్థంకాని స్థితిలో ఉన్నారని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

బడ్జెట్ పై అరుణ్ జైట్లీ ఎన్ని వివరణలు ఇచ్చినా, బీజేపీ ఎంపీలను మెప్పించలేకపోతోందని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే రాజస్థాన్ లో మూడు సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోవడంఎంపీలకు మింగుడు పడటం లేదు. ఎన్టీఏ నుంచి టీడీపీ తప్పుకోనుందే వార్తలు కూడా బీజేపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.