//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు...!

Category : politics

బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటించి కొంత ఊరటనిచ్చారు.

2018-19 సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జైట్లీ.ఏపీ పంపిన అనేక ప్రతిపాదనలు బడ్జెట్‌లో పక్కనపెట్టేశారు. ఏపీకి సంబంధించి మెగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఏపీకి రావాల్సిన విభజన రావాల్సిన హక్కులు, హామీలపై ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలకు మాత్రం జైట్లీ నిధులు కేటాయించినట్లు ప్రకటించారు.

ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు

ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు

ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు

ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు

ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు

ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు

Related News