//single page style gallary page

Budget 2019 Latest Updates

Category : state politics

Click here to read this article in Telugu

కేంద్ర బడ్జెట్ 2019 అప్ డేట్స్

👉డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు.

బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు

5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78శాతం పెరిగాయి. 2018లో పన్ను వసూళ్లు రూ.11.37లక్షల కోట్లు

బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి. రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్‌. పాన్‌ నంబర్‌ లేకపోయినా ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు అవకాశం. పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌తో ఐటీ రిటర్న్స్‌ దాఖలుకు వెసులుబాటు

మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు

విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలిస్తోంది.

రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తాం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400కోట్లకు పెంపు.

దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి

రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం! చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం

స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు. ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం

ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయి.

అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం

సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేయూతకు ఎలక్ట్రానిక్‌ విధానంలో నిధుల సేకరణ. ఇందుకోసం ప్రత్యేక వేదిక.

కఠిన చట్టాలతో దాదాపు 4లక్షల కోట్ల మొండి బకాయిల వసూలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల మూలధన సాయం. ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్స్‌, మీ ఇంటి ముందుకే బ్యాంకు సేవలు రానున్నాయి.

దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు. 17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు. ప్రత్యేకించి ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్‌ చేయనున్నాం.

భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు. భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.

ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ. వీటి వాడకం వల్ల రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా

గ్రామీణ భారత ప్రగతిలో మహిళ పాత్ర కీలకం. అన్ని చోట్లా మహిళా నాయకత్వం పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 78మంది మహిళలు ఎన్నికల్లో విజయం సాధించారు. మహిళల అభివృద్ధికి అన్ని జిల్లాల్లో పథకాలు. జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం

ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నాం.

ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం. 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్‌

పీపీపీల పరంగా అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా ఉంది. స్టాండప్‌ ఇండియా పథకం ప్రకారం వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ

స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్‌. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగింత.

నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు

బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం.

ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.

ప్రపంచంలో టాప్‌-200 విద్యా సంస్థల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థలకు మరిన్ని నిధులు. స్టడీ ఇన్‌ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం.

పరిశోధనలకు ప్రాధాన్యం. జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం.

జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.

పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు రైతులకు ధన్యవాదాలు. రైతులు దిగుమతుల భారం తగ్గించారు.

మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన

అక్టోబరు 2నాటికి ఓడీఎఫ్‌ భారత్‌గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం. మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక ఇదే

81లక్షల గృహాలను ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథక కింద నిర్మించాం

డిజిటల్‌ అంతరాలను తొలగించే డిజిటల్‌ లిటరసీ కార్యక్రమం. నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నాం.

స్వచ్ఛభారత్‌ అభిమాన్‌ పథకం విజయవంతమైంది. 9.6కోట్ల కొత్త మరుగుదొడ్లు నిర్మించాం.

‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.

జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే అనేకమంది రైతులకు శిక్షణ ఇచ్చాం.

1.25 లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునికీకరణ

2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా

గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం. అందుకే గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా

అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించాం.

మీడియా, యానిమేషన్‌, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన.

ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ.

స్టాక్‌మార్కెట్‌లో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు వెసులుబాటు. అవి విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు

ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ

ఎఫ్‌డీఐల ఆకర్షణకు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచంతో పోలిస్తే, భారత్‌కు ఎఫ్‌డీఐలు మెరుగ్గా ఉన్నాయి.

విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం. రెడ్‌ టేపిజం నియంత్రణకు చర్యలు

ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీ కోసం ప్రత్యేక లాబీయింగ్‌.

చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్‌ పథకం

ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం తీసుకువస్తాం. దాదాపు 3కోట్ల దుకాణ యజమానులు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే, వార్షిక టర్నోవర్‌ రూ.1.5కోట్ల కన్నా తక్కువ ఉండాలి.

ఎంఆర్‌వో అంటే తయారీ, మరమ్మతు, నిర్వహణ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తాం

బస్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన చేస్తున్నాం.

మినిమమ్‌ గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నన్స్‌ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.

ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం

భారతమాల, సాగర్‌మాల, ఉడాన్‌ పథకాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి.

ఆదర్శ అద్దె విధానం

ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం.

గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

ఒకే దేశం.. ఒకే గ్రిడ్‌ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం.

రైల్వేల్లో రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నాం.

దేశం గుండా జలమార్గంలో రవాణాకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

మెట్రో రైలు సర్వీసులు పెరుగుతున్నాయి. మరో 300కి.మీ.ల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయి. ఇప్పటివరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉంది.

ఉడాన్‌ పథకంతో చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం కలిగింది.

సాగరమాలతో అనుసంధానం

ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్‌, రవాణా, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం. సాగరమాలతో అనుసంధానం జరుగుతోంది.

మేకిన్‌ ఇండియాతో దేశంలో తయారీ పరిశ్రమ వేగమందుకుంది. అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాం.

ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యంతో స్వచ్ఛ భారత్‌ నిర్మితమైంది.

మౌలిక రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు రావాల్సి ఉంది. ఆశ, విశ్వాసం, ఆకాంక్షల ప్రాతిపదికన గత ఐదేళ్లలో అదనంగా ఒక ట్రిలియన్‌ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించాం.

ఎన్డీయే అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్‌ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది

గత ఐదేళ్లలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు మార్పులు తీసుకువచ్చాం

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం.

వచ్చే దశాబ్ద కాలానికి లక్ష్యాలను అందుకుంటాం. పది లక్ష్యాలతో ఈ దశాబ్దానికి లక్ష్యాలను నిర్ణయించుకున్నాం. ఈ అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశాం.

నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు

Excise duty on diesel and petrol hiked by Rs 1

Customs duty on gold increased from 10 to 12.50%

Surcharge increase on annual income of more than Rs 5 crore

Direct tax collections increased by 78 percent. Tax collection in 2018 is Rs.11.37 lakh crore

Cash withdrawal limit per year from bank account. 2% TDS if crossing Rs. Possibility of filing IT returns in the absence of PAN number. Easy to file IT returns with PAN or Aadhaar number

More on Medium Home Loans Incentives for first time home buyers. Interest rate discount of Rs 3.5 lakh on households under Rs 45 lakh. Interest concession hike from Rs 2 lakh to Rs 3.50 lakh

There are no changes in the personal income tax threshold

We are planning to bring GST on electric vehicles from 12% to 5%. The matter is currently being considered by the GST Council.

There is no tax on income up to Rs 5 lakh.

We will bring transparency in the tax system. Increases corporate tax range to Rs 400 crore

Mega Manufacturing Zones in the country. Approval for foreign companies in the field of battery and solar power

We will bring in new coins of Rs1, Rs2, Rs5, Rs10 and Rs20! They are also recognizable to the blind.

Public sector companies have received Rs. The decision to withdraw Rs 5 lakh crore

Mudra Yojana also applies to Self Help Groups. Seal loan of up to Rs

Six government banks have been recovered from the debt crisis. Commercial banks have reduced their assets worth Rs.

Unique approach to cash flow control

Fundraising for Electronic Systems for Social Enterprises Special platform for this.

About 4 lakh crores of stubborn dues with stringent laws. Public sector banks have a capital of Rs. Online personal loans, banking services will be done in front of your home.

More facilities to attract foreign tourists across the country. World class facilities in 17 tourist centers. We are going to digitize dance, art and cultural metaphors, especially for Adivasis.

Aadhaar cards for NRIs with Indian passport. Establishment of new embassies in countries where there is no Indian embassy.

35 crore LED bulbs distributed nationwide through Ujjala Yojana. The use of these saves Rs

The role of women in rural India is crucial. Women leadership is growing everywhere. Female voters participated in record highs in the 2019 election. 78 women won the election. Schemes in all districts for women's development. 5000 Over Draft Facility for Women with JanDhan Account

We have provided training to 2 crore rural youth through the Prime Minister's Digital Literacy Yojana. We see rapid urbanization as an opportunity.

Separate scheme for irrigation of household water. Jalshakti Abhiyan in 256 districts

India is the third largest economy after the US and China in terms of PPPs. Training of disadvantaged youth under the Standup India Scheme

New channel exclusively on television for startups. Startups are also responsible for managing them.

Establishment of four labor courts

Training program for youth on the effectiveness of Basaveshwari's teachings.

Promotion of sports as part of Khel India.

There are 3 Indian educational institutions in the world's top-200 educational institutions. More funding for international institutions The opportunity for foreign students to come to India and study as part of Study in India.

Prioritize research. Financial assistance for research conducted under the National Research Council.

New Changes in the National Educational Policy. Reforms in school education and higher education.

Thanks to the farmers for being self-sufficient in the production of pulses. Farmers reduced the burden of imports.

Prime Minister of Fisheries for Fisheries

Prime Minister's wish to make ODF India by October 2 This is the gift given by the country on the occasion of the 150th birth anniversary of Mahatma

81 lakh houses have been built under Prime Minister Awas Yojana (PMAY) scheme

Digital Literacy Program to Eliminate Digital Gaps. We will connect cities, towns and villages with technology.

The Swabha Bharat Fan Scheme was a success. We have built 9.6 crore new toilets.

Establishment of the Ministry of Water Resources. Management of all water resources. Water supply to the dwellings as part of the 'Harghar Jal' scheme.

Zero budget agriculture (investment without investment) is being introduced. We have already trained many farmers for this purpose.

1.25 lakh km Modernization of roads

Electricity and gas supply for all households by 2022

Villages, poverty and farmers are our rural India. That is why we will provide modern facilities to rural India. Electricity and gas supply for all households by 2022

We are moving forward to provide a home for all. 1.9 crore dwellings are under construction. House construction period has been reduced to 114 days.

Examining FDI in Media, Animation and Aviation

India is becoming the newest space force in the world. ISRO is a company specializing in the commercialization of services. The world's cheapest space experiments. A special system for space launch products and marketing.

Flexibility in investment in NRIs in the stock market They are recognized as foreign portfolio

The 150th Jayanti celebrations of Mahatma Gandhi this year. This is an extension of the end of the scheme

The attractiveness of FDI will make the Indian economy more transparent. Compared to the world, FDIs are better for India.

New policy for foreign investors without any trouble. Measures to control red tapism

Special lobbying for electric vehicle subsidy.

New Pension Scheme for Retailers

Pension Scheme for Retailers through Prime Minister Karmayogi Manthan Yojana About 3 crore shop owners are likely to benefit from this. However, the annual turnover should be less than Rs 1.5 crore.

MRO means we fully implement the manufacturing, repair and maintenance process

We are designing a single card to pay for bus fare and parking fees.

Minimum Government and Maximum Governance is our policy. We will simplify the approval process for industries.

Loan facility for MSMEs upto Rs

With the Indian, Sagarmala and Udon schemes, the gap between urban and rural areas is narrowing.

Ideal rental policy

Home prices are made available to the general public. The ideal rental policy will be implemented soon.

We have implemented many economic reforms in the last five years. We have brought many reforms in the form of indirect taxes, construction and bankruptcy. Within five years, the value of the economy of the country has increased to billions of dollars. The industrial sector plays a key role in the growth of the country's economy.

We provide electricity to all areas as part of a single grid system. We are giving incentives to the electric vehicle manufacturing industry.

Rs. 50 lakh crores is required. For this purpose we are implementing PPP.

We prefer to transport waterways across the country.

Metro rail services are on the rise. Another 300km of metro route permits were obtained. To date, the country has a 657 km metro line.

With the Udon project, small towns have aviation.

Connectivity with Sagarama

Prime Minister Sadak Yojana, Udon, Industrial Corridor, Transport and Railways are constructing other lines. Connecting with Sagarama.

Manufacturing industry is accelerating with makin 'India. We prefer connectivity.

We have made many changes in direct taxes and registration. Swara Bharat is built with toilet facilities in every home.

There is a huge investment in infrastructure. We have added an additional one trillion dollars to the economy in the last five years on the basis of hope, confidence and ambition.

By the time the NDA came to power, the Indian economy was worth $ 1.85 lakh. India is now a $ 2.5 Lakh economy

Over the last five years, we have introduced a number of changes to the tax regime and credit default control

We are heading towards a $ 5 trillion economy.

We will be meeting the targets for the next decade. We have decided on goals for the decade with ten goals. We have designed this budget as inspiration for these things.

We have plans for a modern Indian design. Double funding for food security compared to 2014-15