//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తుఫాన్ అని తెలిసి జగన్ పారిపోయారు

Category : politics

జగన్ మీద టీడీపీ లో చాల మంది నాయకులూ తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు , వీళ్ళలో ముఖ్యం గా విజయవాడ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అయితే ఒక అడుగు ముందు ఉంటాడు .. తిత్లీ తుఫాన్ కు ఎదురెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడితే తుఫాన్ వస్తుందని తెలిసి జగన్ లోటస్ పాండ్ పారిపోయారన్నారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఐటీ దాడులకు భయపడి చంద్రబాబు శ్రీకాకుళంలో ఉన్నారని జగన్ ఎద్దేవా చేయడం దుర్మార్గం అని.. తిత్లీ తుఫాన్ కు ఎదురెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నవారు గొప్పవాళ్ళా? బాధితులను వదిలేసి పారిపోయిన వారు గొప్పవాళ్ళా? అని ప్రశ్నించారు. జగన్, పవన్ ఇద్దరూ మోడీ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని.. ఉత్తరాంధ్ర పేరును కలవరించే పవన్, తుఫాన్ పై ఎందుకు స్పందించరు? అన్నారు.

జగన్ పాదయాత్ర చేస్తున్న గజపతి నగరం, తుఫాన్ ప్రభావిత ప్రాంతానికి కేవలం 70కిలోమీటర్ల దూరంలోనే ఉందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండే హక్కు జగన్ కు లేదని.. జగన్, పవన్ లను ఉత్తరాంధ్ర ప్రజలు తరిమికొట్టాలన్నారు. వైసీపీ నేతలు చంద్రబాబుపైన అనవసరమైన పోస్టింగులు చేస్తున్నారని.. సోషల్ మీడియాలో అనవసరంగా పోస్టులు పెడితే కేసులు పెట్టేందుకు కూడా వెనకాడమన్నారు.

Related News