//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రంజాన్ కానుకగా కొత్త ప్లాన్లతో బీఎస్‌ఎన్‌ఎల్

Category : business

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రంజాన్ కానుకగా దేశంలోని తన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.786, రూ.599 పేరిట రెండు కొత్త రీచార్జి ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. రూ.786తో రీచార్జి చేసుకుంటే 3జీబీ 3జీ డేటా ఉచితంగా వస్తుంది. దీనికి 90 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇక డేటాతోపాటు రూ.786 టాక్‌టైం లభిస్తుంది. దీన్ని వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.

అదే రూ.599 ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే యూజర్లకు రూ.507 టాక్‌టైం లభిస్తుంది. దీన్ని కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు వాడుకోవచ్చు. మరో రూ.279 టాక్‌టైం కూడా వస్తుంది. కానీ దీన్ని వాయిస్ కాల్స్ కోసమే వాడుకునేందుకు వీలుంటుంది. ఇక రూ.786, రూ.599 ప్యాక్‌లలో ఏ ప్లాన్‌ను రీచార్జి చేయించుకున్నా సరే తరువాత ఒక వేళ రూ.110, రూ.210, రూ.290, రూ.310, రూ.510, రూ.610, రూ.1010, రూ.1510, రూ.2010 ఫుల్ టాక్‌టైంలను రీచార్జి చేయిస్తే వాటిపై 20 శాతం అదనపు టాక్‌టైంను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్నది. ఈ ప్లాన్ల‌ను రీచార్జి చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు గ‌డువు నిర్ణయించారు. ఆ లోప‌ల ఈ ప్లాన్ల‌ను రీచార్జి చేసుకుంటేనే పైన చెప్పిన బెనిఫిట్స్ వ‌ర్తిస్తాయి.