//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జియో,ఎయిర్ టెల్ కు పోటీగా బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

Category : business

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ లకు ధీటుగా ఆఫర్లతో వస్తోంది. డేటా వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో 444 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు 90 రోజులపాటు 3జీ వేగంతో ప్రతి రోజూ 4 జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులు రోజు వారీ డేటా ఒక జీబీ కోసం రూపాయి కంటే తక్కువ చెల్లిస్తాడని అన్నారు. ఇతర సంస్థలు రోజూ 2 జీబీ మాత్రమే అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 4 జీబీ 3జీ డేటా అందించడం విశేషం. దీంతో డేటా ఆఫర్లలో ఇదే గరిష్ఠ ఆఫర్ అని బీఎస్ఎన్ఎస్ ప్రతినిధులు చెబుతున్నారు.