//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హాస్టల్‌లో అమ్మాయిలందరినీ పిలిచి..లోదుస్తులు విప్పించి...లేడీస్ హాస్టల్ లో దారుణం

Category : national

ఓ వైపు మహిళలు ఇప్పుడిప్పుడే తాము ఇప్పటివరకు ఋతుక్రమంలో వాడే సానిటరీ న్యాప్కిన్స్ విషయంలో ఆలోచిస్తూ ఉంటే మరో వైపు చదువుకున్న ఆధునిక మహిళలు సానిటరీ న్యాప్కిన్స్ వాడుతున్న వారిని అవమానిస్తూ ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న ఓ విశ్వవిద్యాలయం ఆవరణలోని రాణీ లక్ష్మీభాయ్ లేడీస్ హాస్టల్‌లో దారుణం వెలుగుచూసింది. హాస్టల్ ఆవరణలో వాడిపారేసిన ఓ శానిటరీ ప్యాడ్ కనిపించడంతో అది వాడి పారేసింది ఎవరు అంటూ విద్యార్థినులందరినీ పిలిపించింది సదరు హాస్టల్ వార్డెన్. వారందరినీ ఒకచోట సమూహంగా నిల్చోబెట్టి ఒక్కోక్కరుగా బట్టలు విప్పాలని ఆదేశించింది. వారి లోదుస్తులలో ఏమయినా సానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారాఅని కూడా పరిశీలించే ప్రయత్నం చేసింది.

దాదాపు యాభై మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి తనిఖీలు చేశారు. ఈ తనిఖీలను వార్డెన్‌తో పాటు ఆమె సహాయకురాలు చేపట్టారని స్థానిక జీ మీడియా తెలిపింది. దీంతో తనిఖీలతో బెదిరిపోయిన కొంతమంది విద్యార్థినులు వెక్కి వెక్కి ఏడ్చారు. మరుసటి రోజు ధైర్యం చేసి యూనివర్శిటీ ఉప కులపతి ఆర్పీ తివారీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆర్పీ తివారీ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.