//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెల్లి కోసం అన్న విటుడిగా మారాడు, అసలేమైంది అంటే ?

Category : editorial

అతడితో మామూలు పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే పారిపోదామన్నాడు. కోరుకున్నవాడు చెంతనుండే సరికి కన్నవాళ్లు గుర్తుకు రాలేదు. ఆశ చూపించిన అతడి చేయి పట్టుకుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ అమాయకురాలికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పట్నం తీసుకు వెళ్లాడు.

అక్కడ కొన్ని రోజులు బాగానే ఉన్నట్లు నటించాడు. తరువాతే అసలు రంగు బయట పెట్టాడు. ఆమెను తీసుకు వెళ్లి బ్రోతల్ హౌ‌స్‌లో ఉంచాడు. అలా మూడేళ్లు ఆ మురికి కూపంలో నానా చిత్ర హింసలు అనుభవించింది. తెలిసిన వ్యాపారి ఒకరు ఆమె దగ్గరకు వచ్చాడు. అతడి దగ్గర తన గోడుని మొరపెట్టుకుంది. ఈ కూపం నుంచి బయట పడేయమంటూ కాళ్లా వేళ్లా పడింది.

మంచి మనసున్న ఆ వ్యాపారి ఆమె విషయాన్ని కుటుంబానికి చేరవేశాడు. చెల్లెల్ని అక్కడినుంచి విడిపించే దశలో అన్నయ్య విటుడిగా మారాడు. అక్కడికి వెళ్లి రెండు వందలిచ్చి లోపలకి వెళ్లాడు. చెల్లెలితో మాట్లాడి బయట పడే మార్గం వివరించాడు. బయటకు వచ్చి పోలీసులకు సమాచారమందించాడు. ఠాణాపై దాడి చేసిన పోలీసులు అతడి చెల్లెలితో పాటు మరొక మహిళను కూడా చెర నుంచి విడిపించాడు.

ఆమె బ్రోతల్ హౌస్‌లో చేరడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇదంతా కధలా అనిపించినా ఇదంతా యదార్ధ ఘటన. బీహార్‌లోని శివ్‌హర్ జిల్లాకు చెందిన ప్రతిమకి అశోక్ ఖలీఫా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తీసుకెళ్ళి బ్రోతల్ హౌస్ లో ఉంచాడు. అదృష్టం కొద్ది బయటపడిన ప్రతిమ బేగూసరాయ్ నుంచి పుట్టిల్లయిన శివ్‌హర్ చేరుకుంది.

Related News