స్కర్ట్స్, స్లీవ్ లెస్, షార్ట్స్ లాంటివి మహిళలే వేసుకోవాలా? మగవాళ్లు వేసుకోకూడదా? ఈ డౌట్ మాకొచ్చింది కాదు.. ఇంగ్లండ్ లోని బకింగ్ హామ్ షైర్ లో నివాసముండే జోయ్ కు వచ్చింది. అందుకే తన వర్క్ చేసే కాల్ సెంటర్ కంపెనీకి షార్ట్ వేసుకొని వెళ్లాడు. దీంతో.. షార్ట్ వేసుకొని ఆఫీస్ కు వస్తావా అంటూ అతడిని గెంటేశారు ఆఫీస్ సిబ్బంది. ఇక.. తన బాధను ట్విట్టర్ లో వెల్లగక్కాడు. షార్ట్స్ వద్దంటే లేడీస్ వేసుకునే స్కర్ట్ లాంటి డ్రెస్ వేసుకెళ్తానని... లేడీస్ కు అటువంటి డ్రెస్సులు వర్క్ ప్లేస్ లో పర్మిషన్ ఉన్నప్పుడు మగాళ్లకు ఎందుకు ఉండకూడదని ట్వీటాడు. అంతే కాదు.. ఓ పింక్ కలర్ స్కర్ట్ లాంటి డ్రెస్ వేసుకొని మళ్లీ ఆఫీస్ కు వెళ్లాడు. ఇంతలో మనోడి ట్వీట్లన్నీ సోషల్ మీడియాలో వైరలవడంతో కంపెనీకి విషయం తెలిసింది. ఇక... ఇంగ్లండ్ ఏరియాలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో కంపెనీ షార్ట్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసిందట. దీంతో బకింగ్ హామ్ షైర్ లో హీరో అయిపోయాడు జోయ్. ఇక.. ఆరోజు మాత్రం అదే పింక్ డ్రెస్ లో ఆఫీస్ లో ఉండి.. మరుసటి రోజు నుంచి హ్యాపీగా షార్ట్స్ లో ఆఫీస్ కు వెళ్తున్నాడట జోయ్. సోషల్ మీడియా హీరో అయిపోయిన జోయ్ ని నెటిజన్లు కంపెనీతో ఫైట్ చేసి మరీ గెలిచిన తీరును తెగ మెచ్చుకుంటున్నారు.