//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్లీ గర్జించైనా బ్రిటన్ స్టార్ అథ్లెట్ మో ఫరా

Category : sports

బ్రిటన్ స్టార్ అథ్లెట్ మో ఫరా మళ్లీ గర్జించాడు. ఈ నల్లజాతి వజ్రం వరుసగా మూడోసారి 10,000 మీటర్ల రేసులో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. పదివేల మీటర్ల ఫైనల్ రేసును ఫరా 26 నిమిషాల 49.51 సెకన్ల టైమింగ్‌తో ముగించి స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. కెరీర్‌లో చివరి ప్రపంచ ఛాంపియన్ షిప్ ఆడుతున్న ఫరా వరుసగా మూడోసారి విజేతగా నిలిచి సుదూర పరుగులో తనకు తిరుగులేదని మరోసారి చాటుకున్నాడు.

34ఏండ్ల ఫరాకిది అంతర్జాతీయ వేదికపై వరుసగా పదో స్వర్ణ పతకం కావడం విశేషం. 2012 ఒలింపిక్స్‌లో ఇదే స్టేడియంలో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన ఫరా.. రేసు ఆరంభంలో కొంత ఒత్తిడికి గురైనట్లు కనిపించినా చివర్లో మాత్రం వేగాన్ని పెంచి గమ్యాన్ని చేరాడు. ఉగాండాకు చెందిన 20ఏండ్ల యువ కెరటం జోషువా చెప్టెగి.. ఫరా కంటే మూడుసెకన్లు వెనుకబడి రజత పతకానికి పరిమితమయ్యాడు.

కెన్యా అథ్లెట్ పాల్ తనూయి కాంస్య పతకం సరిపెట్టుకున్నాడు. ఈ ఛాంపియన్ షిప్‌లోనే 5000 మీటర్లలోనూ పోటీపడనున్న ఫరా.. ఆ రేసులోనూ స్వర్ణ పతకం సాధించి కెరీర్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ రేసులోనూ విజేతగా నిలిస్తే వరుసగా మూడో ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోనూ డబుల్ (10వేలు, 5వేల మీటర్లలో స్వర్ణం) సాధించిన అథ్లెట్‌గా రికార్డు అందుకుంటాడు.

ఫరాకిది 10వేల మీటర్ల రేసులో నాలుగో ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకం. తొలిసారిగా 2011లో రజతం సాధించిన ఫరా.. ఆ తర్వాత వరుసగా మూడు ఛాంపియన్ షిప్స్‌లోనూ పసిడి నెగ్గాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ ఫరా స్వర్ణ పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. మరోసారి బ్రిటన్ గర్వపడేలా చేశాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణం ఇంత అద్భుతంగా సాగినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఫైనల్ ముగిశాక ఫరా అన్నాడు. 5వేల మీటర్ల ఫైనల్ ఈనెల 13న జరుగనుంది.

Related News