Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నే..... ఇది ఫిక్స్ అంటూ నేమ్ ప్లేట్....!

Category : state politics

ఇప్పటికే ముగిసిన,ఏపీ ఎన్నికల ఫలితాలు రావాలి అన్న. గెలిచిన పార్టీ యెక్క అధినేత సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలి అన్న. మరో 38 రోజులు వేచిచూడక తప్పని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే ఒక వైపు చంద్రబాబు సీఎం అవుతాడు అంటూ...? మరో వైపు వై.ఎస్ జగన్ సీఎం అవుతాడు అంటూ...? వీళ్ళే కాకుండా ఇంకో వైపు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అంటూ ...?

ఎవరికి నచ్చిన రీతి లో వాళ్ళ మద్దతు దారులు, వారి యెక్క అభిమానాన్ని వ్యక్త పరుస్తున్నారు.ఇది ఇలా ఉంటె ఇప్పటికే దేశ వ్యాప్తగా వెలువడిన సర్వేల ఆధారంగా చూసుకుంటే మాత్రం వైసీపీ నే అధికారంలోకి వస్తుంది అంటూ అంత అనుకుంటున్నారు.అలాగే ఈ విషయంలో ఆ పార్టీ నేతలు సైతం అంతే ధీమాతో ఉన్నారు.

అందులో భాగంగానే సీఎంగా జగన్ రానున్నారని, ఆయన పేరిట నేమ్ ప్లేట్ ను కూడా రెడీ చేయించి పెట్టారు, ప్రస్తుతం ఈ నేమ్ ప్లేట్ కి సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ గా మారాయి.ఈ నేమ్ ప్లేట్ లో ఉన్న వివరాల ప్రకారం "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు" అంటూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ గా మారింది.అలాగే నిన్నటికి నిన్న నారా చంద్రబాబు నాయుడు , వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు అంటూ ఓ ఫోటో ని మార్పింగ్ చేసి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం కూడా చూసాం...ఈ సందర్భంలోనే ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఏ వార్త అయినా పెను సంచలనంగా మారుతు వస్తున్నాయి.