Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కళ తప్పిన లోటస్ పాండ్.... రూట్ మార్చిన వై.ఎస్ జగన్ అమరావతి కేంద్రంగా అధినేత రాజకీయాలు....!

Category : state politics

ఏపీ ప్రతి పక్ష నేత వై.ఎస్ జగన్ రూట్ మార్చారు. ఇన్నాళ్లు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా సాగిన జగన్ రాజకీయ కార్యకలాపాలు..ఇక పై ఏపి రాజధాని అమరావతి కేంద్రంగా కొనసాగ బోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉంటూ వస్తున్న ఆయన...ఇప్పటివరకూ లోటస్ పాండ్ ఇది ఆయన చిరునామా..ఏపీ ప్రతిపక్షనేత అయినా.. రాష్ట్రం విడిపోయి అయిదేళ్ళు గడుస్తున్న నిన్నటి వరకూ ఇదే జగన్ కేరాఫ్ అడ్రస్. చివరకు ఏపి ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం కూడా జగన్ లోటస్ పాండ్‌ కే వచ్చి విశ్రాంతి తీసుకోవడం. ఆయనకు ఈ నివాసానికి మధ్య విడదీయ రాని అనుబంధాన్ని తెలియజేస్తుంది. అలాగే జగన్ నిర్వహించే ఏ ఇతర వ్యవహారాలు అయిన ..లేదా ఆ పార్టీ కార్యకలాపాలు ఐన కూడా ఆయన లోటస్ పాండ్ కేంద్రంగానే కొనసాగించాడు.

కానీ ఇప్పుడు జగన్ లోటస్ పాండ్ ని విడిచి అమరావతికి షిఫ్ట్ అవుతున్నారు.అలాగే లోటస్ పాండ్ లోని సామగ్రి మొత్తాన్ని ప్యాక్ చేసి అమరావతికి పంపుతున్నారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న అంచనాలతో ఉన్న జగన్.. అందుకోసం ముందుగానే తన ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు హైదరాబాదు కేంద్రంగా లోటస్ పాండ్ లో ఎన్నెన్నో కీలక సమావేశాలు, అనేక కార్యకలాపాలకు వేదికైన లోటస్ పాండ్ మే 23 తర్వాత తన వైభవాన్ని కోల్పో బోతోంది.

మే 21న మంచి మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నుంచే అమరావతిలో ఉండబోతున్నారు వై.ఎస్ జగన్.ఇందుకోసం విజయవాడలోని జగన్ సొంత నివాసం వేదిక కానుంది. ఎంతో ఆధునిక హంగులతో నిర్మించిన ఈ నివాసం. ఆయన నివసించబోతున్నట్లు అనేక కార్యకలాపాలకు,సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది. ఇకపై అక్కడి నుంచే ఆయన తన రాజకీయ కార్యకలాపాలు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ వైసీపీపై టీడీపీ నేతలు ఈ అంశంపై అనేక విమర్శలు గుప్పించేవారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ రాజకీయాలు చేస్తున్నారని పదే పదే విమర్శలు ఎక్కుపెట్టేవారు. ఏపీలో తాను గెలిచే అవకాశాలున్నాయి కాటట్టి..

ఇకపై టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే లోటస్ పాండ్‌ నుంచి అమరావతికి మకాం మార్చారువైఎస్ జగన్. ఈ రకమైన సంచలన నిర్ణయం ఆ పార్టీ శ్రేణులతో పాటు క్యాడర్ లోనూ పూర్తి జోష్ నింపుతుంది అనే చెప్పాలి.అలాగే ఈ రకమైన నిర్ణయం అధికార పార్టీ నేతలను కాస్త కలవర పెట్టే విషయమే అనుకోవాలి.

Related News