Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ 120 స్థానాలు గెలుస్తుంది...

Category : state politics

తెలుగుదేశం విజయం ఏకపక్షమేనని టిడిపి జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ అన్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి ఏపీలో జరిగిందన్నారు.చేసిన అభివృద్ధి మళ్ళీ చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయనున్నది అన్నారు.

16 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంక్షేమం చేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. టిడిపి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమాల్లో ఎన్నారై టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక, శాసనసభ ఎన్నికల ఫలితాలు మే 23న రానున్నాయి. ఏప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీ ,ప్రతిపక్ష వైసీపీ ల హోరాహోరీగా పోరు జరిగింది.గెలిచేది ఎవరనేది అందరిలో ఉత్కంఠ నెలకుంది.