//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దీపావ‌ళి పండుగ రోజున అర్థ‌రాత్రి ప‌వ‌న్‌తో బొత్స భేటీ.. చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు..!

Category : politics

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు దాదాపు 15 సంవ‌త్స‌రాల‌పాటు చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రిస్థితి ప్ర‌స్తుతం పూర్తిగా మారిపోయింద‌న్న గుస‌గుస‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మా అని కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో ఆయ‌న వైసీపీ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కిర‌ణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా, పీసీసీ అధ్య‌క్షుడిగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆశావ‌హుల్లో ఒక్క‌రిగా ఢిల్లీ అధిష్టానం వ‌ద్ద ఒక వెలుగు వెలిగారు.

కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్న ప‌ర‌ప‌తి, ప‌లుకుబ‌డి ప్ర‌స్తుతం వైసీపీలో బొత్సకు లేవ‌ని, ఆయ‌న సన్నిహితులే అంటున్నారు. త‌న మాట చెల్లుబాటు కావ‌డం లేద‌ని ఆయ‌న అనుయాయుల వ‌ద్ద బొత్స స‌త్య‌నారాయ‌ణ పెద‌వి విరుస్తున్న‌ట్టు భోగ‌ట్టా. నిన్నా.. మొన్న‌టి వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర వైసీపీ వ్య‌వ‌హారాల‌ను బొత్స స‌త్యనారాయ‌ణ స‌ర్దిపెట్టినా.. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విజ‌య‌వాడ‌లో మ‌కాం వేసి పార్టీ అధినేత పాద‌యాత్ర మొద‌లుకొని పార్టీ వ్య‌వ‌హారాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ ప‌రిస్థితి అయోమ‌యంగా త‌యారైంది.

బొత్స స‌త్య‌నారాయ‌ణ గ‌తంలో విశాఖ కేంద్రంగా వైసీపీ వ్య‌వ‌హారాన‌లు చ‌క్క‌బెట్టేవారు. అయితే, ప్ర‌స్తుతం విజ‌య‌సాయిరెడ్డి రావ‌డంతో సీన్ రివ‌ర్స్ అయింద‌డి. అప్పుడ‌ప్పుడు విశాఖ‌లో ప్రెస్‌మీట్‌లు, ధ‌ర్నాల‌కు మాత్ర‌మే బొత్స ప‌రిమిత‌మ‌వ్వాల్సి వ‌స్తుంది. ఇక‌పోతే విజ‌య‌న‌గ‌రం రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేస్తార‌నుకుంటే జిల్లాకు చుట్టం చూపుగా వ‌చ్చి వెళ్లిపోతున్నారు బొత్స‌. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ సీనియ‌ర్ పాత్ర‌ను పోషించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ముఖ్య‌మైన పార్టీ కార్య‌క్ర‌మం ఉంటే త‌ప్ప బొత్స జిల్లాకు రాక‌పోవ‌డంతో ఆయ‌న అనుచ‌రుల‌కే మింగుడు ప‌డ‌టం లేదు. దాంతో జిల్లా వైసీపీలో వ‌ర్గ‌పోరు, ఆధిప‌త్య పోరు ఎక్కువైపోయింది. నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక పార్టీ మూడు గ్రూపులు, ఆరు వ‌ర్గాలుగా అన్న‌ట్టుగా త‌యారైంది. జిల్లా కేంద్రంలో పోట‌గ‌ట్ల వ‌ర్గం, బొత్స వ‌ర్గం గ్రూపుల పోరుతో ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్తలు న‌లిగిపోతున్నారు. జిల్లాలో వైసీపీ జెండా ఒక్క‌టే అయినా ఎవ‌రి ఎజెండా వారిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

పార్టీలో ఇంత జ‌రుగుతున్న వైసీపీ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి బొత్స ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే అంటున్నారు.

మ‌రోవైపు బొత్స కుటుంబానికి ద‌క్క‌నున్న ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటుపై పార్టీలోనే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌తంలో అసెంబ్లీ సీటు, ఎంపీ సీటు క‌లిపి మొత్తం ఐదు సీట్ల‌లో బొత్స కుటుంబ స‌భ్యులే ఉండేవారు. చీపురుప‌ల్లి, గ‌జ‌ప‌తిన‌గ‌రం, నెల్లిమ‌ర్ల శాస‌న‌స‌భ స్థానాలు, విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ వంటి ప‌ద‌వుల్లో ఆయ‌న బంధుగ‌ణ‌మే ఉండేవారు. 2014 ఎన్నిక‌ల్లో కూడా చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల‌, గ‌జ‌ప‌తిన‌గ‌రం అసెంబ్లీ సీటు విజ‌య‌న‌గ‌రం ఎంపీ స్థానం నుండి బొత్స కుటుంబ స‌భ్యులే బ‌రిలో నిలిచారు.

అయితే, అప్ప‌టికి.. ఇప్ప‌టికీ మారిన ప‌రిస్థితుల్లో బొత్స కుటుంబానికి నాలుగుగైదు సీట్లు రావ‌డం క‌ష్ట‌మ‌ని ఎంపీ సీటుతో క‌లుపుకుని కేవ‌లం రెండు సీట్ల‌ను మాత్ర‌మే పార్టీ అధినేత జ‌గ‌న్ క‌న్ఫాం చేశార‌ని అంటున్నారు. గ‌జ‌ప‌తి న‌గ‌రం అసెంబ్లీ స్థానం, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స్థానానికే బొత్స కుటుంబాన్ని ప‌రిమితం చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ భావించాడ‌ట‌. ఈ విష‌యాన్ని వైసీపీ నేత‌ల ద్వారా తెలుసుకున్న బొత్స స‌త్య‌నారాయ‌ణ అల‌క బూనార‌ని స‌మాచారం.

అంతేకాక‌, గ‌తంలోనూ కాపుల‌కు రిజ‌ర్వేస‌న్లు క‌ల్పించ‌లేమ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను సైతం బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న స‌న్నిహితుల వ‌ద్ద ఖండించార‌ట‌. క‌నీసం పార్టీ నాయ‌కుల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటే మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు తామేమి స‌మాధానాలు చెప్పాలి..? అంటూ ఇత‌ర వైసీపీ నేత‌ల వ‌ద్ద మ‌ద‌నప‌డ్డాడు. ఇలా త‌న కుటుంబానికి సీట్ల కుటాయింపులోనూ త‌నతో ఒక్క‌మాటైనా చెప్పకుండా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతోపాటు కాపు రిజ‌ర్వేష‌న్లు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప్రమేయం లేకుండా నెల‌కో ఇన్‌ఛార్జ్ ల‌ను మారుస్తున్న వైఎస్ జ‌గ‌న్ తీరును స‌హించ‌లేని బొత్స పార్టీ మారాల‌నే ఆలోచ‌న చేశార‌ట‌. అందులో భాగంగానే, త‌నతో స‌న్నిహితంగా ఉండే ఓ బ‌ఢా నిర్మాత‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌ల్లో ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి జ‌న‌సేన‌లో చేరిక‌పై చ‌ర్చించార‌ట‌. అతి త్వ‌ర‌లో జ‌న‌సేన నిర్వ‌హించ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ చేర‌నున్న‌ట్టు స‌మాచారం.

Related News