Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా.. నేడు టీడీపీలో చేరిక

Category : politics state

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో.. రాజకీయ నేతల కప్పదాట్లు రెట్టించాయి. తాజాగా వైసీపీ నేత, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మురళీ రామకృష్ణ టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మురళీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించారు.