Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ .. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా

Category : politics state

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించాల్సిన తొలి జాబితా వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 16కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. 16 ఉదయం 10.26 గంటలకు జాబితాను విడుదల చేయనుంది.

వైసీపీ తొలి జాబితా ఈ రోజు ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు అని ప్రకటన రావటంతో పార్టీ లో ఉత్కంఠ నెలకొంది . 70 నుంచి 80 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు అని అందరూ భావించారు.

అలాగే పార్టీలో చేరికలను బట్టి రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 20 నుంచి 40 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా విడుదల కానుందని సమాచారం. కాగా... జాబితా ప్రకటన చేస్తారని భావిస్తే జగన్ జాబితా ప్రకటన వాయిదా వేశారు.మార్చి 16కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.