//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు... రేవంత్ కు చెక్ పెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Category : politics

టీడీపీ లో తనదైన శైలిలో కేసీఆర్ మీద విరుచుకుపడిన రేవంత్ రెడ్డి Congress లో చేరినా గులాబీ బాస్ మీద తన దూకుడు ఏ మాత్రం తగ్గకుండా పోరాటం చేస్తున్నాడు.టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా… పార్టీలో తిరుగులేని స్థాయిలో ఉన్న రేవంత్.. కేసీఆర్‌ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ అంటూ Congress లో చేరారు. వెళ్తూ.. వెళ్తూ.. టీడీపీ వీర విధేయులుగా తన వర్గంలో ఉన్న ముఖ్య నాయకులను సైతం పార్టీలోకి తీసుకుపోయారు. వారందరికీ టికెట్లు ఇస్తామన్న హామీ మేరకే తన వెంట తీసుకెళ్లారు. వారిలో చాలా మంది.. టీడీపీలో ఉంటే రాజకీయభవిష్యత్ ప్రశ్నార్ధకం అన్న భావనలోనే రేవంత్ ను నమ్ముకుని రేవంత్ వెంట నడిచారు.కానీ ఇప్పడు అక్కడ రేవంత్ సీన్ రివర్స్ అయ్యింది. రేవంత్ వర్గానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లో పాతుకపోయిన పాత బ్యాచ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతోంది. రేవంత్ దూకుడుకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తుంది.

Congress స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి వర్గం గట్టిగా పట్టుబడుతున్న స్థానాల్లో.. బలమైన అభ్యర్థులుగా మరికొంత మందిని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరపైకి తెచ్చారు. కానీ ఆ పంచాయితీ తేలక ఆ స్థానాలన్నింటినీ పెండింగ్‌లో పెట్టారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించి ధనసరి ‌అనసూయ అలియాస్ సీతక్కకు మాత్రమే టిక్కెట్ ఖరారయిందని.. మిగతా రేవంత్ అనుచరులకు ఎవరికీ టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. వేం నరేంద్ రెడ్డికి వరంగల్ వెస్ట్, అరికెల నర్సారెడ్డికి నిజామాబాద్ రూరల్, రాజారామ్ యాదవ్ కి ఆర్మూరు, సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి , దేవరకొండ కి బిల్యా నాయక్, ఇల్లందు కి హరరిప్రియ, సూర్యాపేటకు పటేల్ రమేష్ రెడ్డి, చెన్నూరు కి బోడ జనార్దన్ పేర్లను రేవంత్ రెడ్డి గట్టిగా సిఫార్సు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతానికి అయితే ఆయా పేర్లను పెండింగ్‌లో పెట్టారు. చివర్లో ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో వారికే ఇస్తారు అనే టాక్ వినిపిస్తుంది.

Congress పార్టీ మార్క్ రాజకీయాలను చూస్తే.. ఆధిపత్య ధోరణిలో సాగుతుంది అని చెప్పొచ్చు. తన వర్గానికి టిక్కెట్లు ఇప్పించుకోవడం.. వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అత్యవసరం. రేపు ఏ పదవికైనా వారి బలమే ప్రధానంగా ఉంటుంది. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి వర్గం బలం పుంజుకోకుండా ఉత్తమ్ చెక్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏఐసిసి పెద్దల వద్ద తనకు ఉన్న పరిచయాలతో రేవంత్ కు చెక్ పెడుతున్నారు అని టాక్. ఈ విషయంలో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్‌.. కూడా అసంతృప్తిలో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు టికెట్ల పంచాయితీతో మరోసారి బయట పడింది.

Related News