//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌లోకి సీఎం కేసీఆర్ నియోజ‌క‌వర్గానికి చెందిన‌ టీఆర్ఎస్ కీల‌క నేత‌..!

Category : politics

టీఆర్ఎస్ పార్టీలో బుజ్జ‌గింపుల ప‌ర్వం ఊపందుకుంది. పార్టీ మారుతారంటూ ప్ర‌చారం మొద‌ల‌వ‌డంతో సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్‌కు చెందిన న‌ర్సారెడ్డిని సాక్ష్యాత్తు మంత్రి హ‌రీశ్‌రావు రంగంలోకి దిగారు. గ‌జ్వేల్‌లోని న‌ర్సారెడ్డి నివాసానికి మంత్రి హ‌రీశ్ స్వ‌యంగా వెళ్లి బుజ్జ‌గింపుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీ మారే నేత‌ల సంఖ్య పెర‌గ‌డం ప్ర‌ధాన పార్టీల‌కు వ‌ణుకు పుట్టిస్తుంది. కాంగ్రెస్ నేత‌ల‌పై టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం దృష్టి సారిస్తే, గులాబీద‌ళాన్ని వీక్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తుంది.

అందులో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కీల‌క నేత న‌ర‌సారెడ్డికి గాల‌మేసింది పీసీసీ నాయ‌క‌త్వం. రెండు రోజుల క్రితం న‌ర్సారెడ్డి ఇంటికి టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వెళ్లి మంత‌నాలు సాగించారు. విష‌యం లీక్ అవ‌డంతో న‌ర‌సారెడ్డిని బుజ్జ‌గించేందుకు మంత్రి హ‌రీశ్‌రావు రంగంలోకి దిగారు. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో కీలక నేత కావ‌డంతో ఆయ‌న పార్టీ మారితే, టీఆర్ఎస్ విజ‌య అవ‌కాశాలు తారుమారు అయ్యే అవ‌కాశం ఉంది.

Related News