//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఔట్‌..:!

Category : politics

తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు త‌రువాత రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇప్ప‌టికే గులాబీ బాస్ 105 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరారు. దాంతో మిగ‌తా పార్టీలు కూడా ఎన్నిక‌ల క‌స‌ర‌త్తును మొద‌లు పెట్టాయి. అయితే, ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌నుబ్ట‌టి కొన్ని మీడియా సంస్థ‌లు స‌ర్వేల‌ను మొద‌లు పెట్టాయి. ఈ నేప‌థ్యంలోనే ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్‌ చేయించిన స‌ర్వే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మింగుడు ప‌డ‌నివ్వ‌డం లేదు.

ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ చేయించిన ఎన్నో స‌ర్వేలు తూచా త‌ప్ప‌కుండా నిజ‌మ‌య్యాయి. అంత నిఖార్సుగా ఉంటాయి ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ సంస్థ చేసిన స‌ర్వేలు. ల‌గ‌డ‌పాటి ఒక్క‌సారి స‌ర్వే చేసి ఫ‌లితాలు చెప్పాడంటే అవి క‌చ్చితంగా స‌క్సెస్ అయి తీరుతాయి. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీగా ఎమ్మెల్యే సీట్ల‌ను ద‌క్కించుకుంటాయ‌ని, అలాగే, చివ‌ర‌కు జేడీఎస్ కింగ్ మేక‌ర్ అవుతుంద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది ఈటీ - ఎకనామిక్ టైమ్స్ స‌ర్వే. ఈటీ - ఎకనామిక్ టైమ్స్ స‌ర్వే చెప్పిన విధంగానే జేడీఎస్ కింగ్ మేక‌ర్ అవ‌డ‌మే కాకుండా, ఏకంగా కాంగ్రెస్‌తో చేతులు క‌లిపిన జేడీఎస్ అధినేత కుమార స్వామి ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్నాడు. దీంతో ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ స‌ర్వేపై ప్ర‌జ‌ల్లో మ‌రింత న‌మ్మ‌కం ఏర్ప‌డింది.

ఇప్పుడు, తాజాగా తెలంగాణ‌లో స‌ర్వే నిర్వ‌హించిన ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ స‌ర్వే సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో వెల్ల‌డించింది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఆశీర్వాద స‌భ‌లో చెప్పిన‌ట్టు టీఆర్ఎస్‌కు వంద సీట్లు రావ‌ని స్ప‌ష్టం చేసింది. తెలంగాణ‌లో ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ స‌ర్వే ప్ర‌కారం 35 నుంచి 40 సీట్లు మాత్ర‌మే రానున్నాయి. కాంగ్రెస్‌కు 50 నుంచి 57 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది.

ఇక మ‌హాకూట‌మిలో భాగ‌స్వామి అయిన టీడీపీకి 18 స్థానాల్లో వ‌ర‌కు గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. ఎంఐఎంకు 8 స్థానాలు. ఇక బీజేపీ విష‌యానికొస్తే, అసెంబ్లీ సీట్ల సంఖ్య‌లో ఖాతా తెరిచే అవ‌కాశ‌మే లేద‌ని ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ఫ‌లితాలు తెలుసుకున్న మ‌హాకూట‌మి నేత‌ల‌కు మ‌రింత ఉత్సాహంతో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తుంటే.. టీఆర్ఎస్ నేత‌ల‌కు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంద‌ట‌. మ‌రి ఈటీ - ఎక‌నామిక్ టైమ్స్ సంస్థ స‌ర్వే పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.