//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ నాయ‌కుడు దారుణ హ‌త్య‌..!

Category : politics

క‌ర్నూలు జిల్లాలో ఫ్యాక్ష‌న్ త‌గాదాలు మ‌ళ్లీ ప‌డ‌గ విప్పాయి. పాత గొడ‌వ‌ల‌ను మ‌న‌సులో పెట్టుకుని ప్ర‌త్య‌ర్థులు ఓ వ్యాపారి ర‌క్తాన్ని క‌ళ్ల‌జూశారు. దేవ‌ర‌కొండ మండ‌లం వెంక‌టాపురం గ్రామంలో టీడీపీ నాయ‌కుడ్ని దారుణంగా హ‌త్య చేశారు. హింస సంస్కృతి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న సీమ‌లో మ‌రోసారి క‌త్తులు దూసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

వెంక‌టాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయ‌కుడు సోమేశ్వ‌ర్‌గౌడ్‌ను దారికాచి మ‌రీ వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి చంపేశారు అత‌ని శ‌త్రువులు. మృతుడు శుక్ర‌వారం రాత్రి మ‌ద్యం షాపును క్లోజ్ చేసుకుని ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో మ‌ల్లెదొడ్డి మార్గం మ‌ధ్య‌లో దుండ‌గులు ఎటాక్ చేశారు. సోమేశ్వ‌ర్‌గౌడ్ అత‌ని కుమారుడు శివ బైక్‌పై వెళుతుండ‌గా ప్ర‌త్య‌ర్ధులు ఈ దాడికి పాల్ప‌డ్డారు.

సోమేశ్వ‌ర్‌గౌడ్‌, శివ క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి మ‌రీ ప్ర‌త్య‌ర్థులు త‌మ వెంట తెచ్చుకున్న క‌త్తుల‌తో దాడి చేశారు. ఈ దాడిలో సోమేశ్వ‌ర‌రావు అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, శివ మాత్రం పారిపోయి ప్రాణాల‌ను కాపాడుకున్నాడు. క‌త్తిపోట్లు, వేట కొడ‌వ‌ళ్ల గాయాల‌తో ర‌క్త‌పు మ‌డుగులో క‌లిపిన సోమేశ్వ‌ర్‌గౌడ్‌ను అత‌ని కుమారుడు శివ స్థానికుల స‌హాయంతో ప్రాణాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించాడు. ఒంటినిండా గాయాలు, అధికంగా గాయాలు కావ‌డంతో సోమేశ్వ‌ర్‌గౌడ్‌ను ఆటోలో త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందాడు. త‌న తండ్రి మృతికి పాత‌క‌క్ష‌లే కార‌ణ‌మ‌ని శివ‌ చెప్పారు హ‌త్య ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన శివ వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని, లేకుంటే త‌న ప్రాణాల‌ను కూడా తీస్తార‌ని తెలిపాడు.

Related News