Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ నుంచి పలువురి సస్పెన్షన్‌

Category : politics state

వరంగల్ అర్బన్ రూరల్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన పలువురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని రూరల్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి చెందిన తడుక అశోక్‌గౌడ్‌, చెన్నారావుపేటకు చెందిన వనపర్తి మల్లయ్య, నర్సంపేటకు చెందిన కూనమల్ల పృథ్వీ, పరకాల నియోజకవర్గంలో పులిగిళ్ల ముకిడ రాజేశ్వరరావు, పరకాల పట్టణానికి చెందిన దేవూనూరి మేఘనాథ్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు వీరందరిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పరకాల పట్టణానికి చెందిన డాక్టర్‌ సిరంగి సంతోష్‌ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. ఇతర పార్టీలకు సహకరించిన వారి వివరాలను రాష్ట్ర పార్టీకి పంపించినట్టు పేర్కొన్నారు.

Related News