//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌హాకూట‌మికి గుడ్ బై చెప్పిన కీల‌క పార్టీ ..!

Category : politics

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో Mahakutami ఎప్పుడు బ‌రిలోకి దిగుతోంది. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఒక్క‌టే. సీట్ల స‌ర్దుబాటు ఎపిసోడ్ ముగిసి Mahakutami లోని పార్టీలు అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేస్తే అస‌లు యుద్ధం మొద‌లైన‌ట్టే. కానీ, ఆ సీట్ల స‌ర్దుబాటు ద‌గ్గ‌రే విష‌యం ముందుకు క‌ద‌ల‌డం లేద‌ట‌. అంతా బాగానే ఉంది. అతి త్వ‌ర‌లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస్తామ‌ని Congress చెబుతున్నా వాస్త‌వం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందంటూ అంఉట‌న్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఇప్ప‌టికే టీజేఎస్ సీట్ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేదంటోంది. ఇప్పుడు సీపీఐ కూడా తేడా వ‌స్తే తాడోపేడో తేల్చుఉంటామ‌ని అన్న సంకేతాల‌ను పంపుతోంది. దీంతో ఈ ప‌రిస్థితిని కాంగ్రెస్ ఎలా అధిగ‌మిస్తుంద‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింద‌ట‌.

గెలిచే స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేస్తామ‌న్న టీడీపీ పరిమిత సంఖ్య‌లోనే సీట్ల‌ను డిమాండ్ చేస్తోంది. టీజేఎస్ మాత్రం 15 సీట్ల‌కు త‌గ్గేది లేద‌ని పైకి చెబుతున్నా 12 వ‌ర‌కు గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంద‌ని కాంగ్రెస్ కండువాలు చ‌ర్చించుకుంటున్నాయి. టీజేఎస్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో అర్ధంకాక తెలంగాణ Congress నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వేళ సీపీఐ కూడా నా సంగ‌తేంట‌ని అడ‌గటం మొద‌లు పెట్టేసింది.

త‌మ‌కు రెండు లేదా మూడు సీట్ల‌ను మాత్ర‌మే ఇస్తున్న‌ట్టు లీకుల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారంటూ Mahakutami లోని పార్టీల వైపు కూట‌మిలోని పార్టీల వైపు వేలు చూపించారు తెలంగాణ‌లోని సీపీఐ కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్‌రెడ్డి. ఆరు సీట్ల‌ను డిమాండ్ చేస్తున్న సీపీఐ ఒక్క‌టికి కూడా త‌గ్గేది లేదంటోంది. కాంగ్రెస్ సీపీఐకి మూడు ఇస్తామ‌ని చెబుతోంద‌ట‌. అయితే, ఆ మూడు స్థానాలు కూడా రిజ‌ర్డ్ నియోజ‌క‌వ‌ర్గాలే కావ‌డంతో మ‌రింత అస‌హ‌నానికి లోన‌వుతోంద‌ట సీపీఐ. ఆదివారం ఇదే విష‌య‌మై స‌మావేశం కాబోతున్న సీపీఐ నేత‌లు త‌మ‌ను కాంగ్రెస్ లైట్ తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తే తాడోపేడో తేల్చుకోవాల‌న్న దిశ‌గా ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.

ఒక వైపు టీజేఎస్‌ను హ్యాండిల్ చేయ‌డానికి తెలంగాణ పీసీసీ నేత‌లు కిందా మీదా ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో సీపీఐ కూడా సీట్ల విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని చెబుతుంద‌టంతో మ‌హాకూట‌మిలో టెన్ష‌న్ పెరుగుతోంద‌ట‌. మ‌హాకూట‌మి ఏర్పాటు దిశ‌గా ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న వెంట‌నే తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు TDPని చూసే ఆందోళ‌న చెందార‌ట‌.TDP ఎన్నిసీట్లు డిమాండ్ చేస్తుంద‌న్న‌దే ఆ ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌ట‌. కానీ, ఊహించ‌ని రీతిలో గెలిచే స్థానాల‌ను మాత్ర‌మే అడ‌గాల‌ని చంద్ర‌బాబు ఆదేశించ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు రిలాక్స్ అయ్యార‌ట‌. అదే స‌మ‌యంలో నెమ్మ‌దిగా స్వ‌రం పెంచుతూ వ‌చ్చిన టీజేఎస్ టీడీపీ స్థాయిలో సీట్ల‌ను డిమాండ్ చేసే స్థాయికి వ‌చ్చేసింది. మ‌రో వైపు సైలెంట్‌గా తీసుకునే స‌మ‌స్యే లేద‌ని చెబుతోంద‌ట‌. అవ‌స‌ర‌మైతే మ‌హాకూట‌మికి గుడ్ బై చెప్పి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతామ‌ని తేల్చి చెబుతోంది సీపీఐ.

Related News