//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పార్టీ నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ ... ఎందుకంటే

Category : politics state

అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఎన్నికల నగారా మోగింది. దీంతో ఏపీ లోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటన పైన వేగాన్ని పెంచాయి. ఇక ప్రజా క్షేత్రంలో ప్రచారంలోకి తీసుకు వెళ్లాలని భావిస్తున్న నేతలు ప్రతి జిల్లా వారీగా అభ్యర్థులు ప్రకటిస్తున్నారు.

ఒక పక్క టిడిపి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంటే, వైసిపి ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని విఫలయత్నాలు చేస్తోంది. ఇక జనసేన పార్టీ సైతం రానున్న ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన దానికి సిద్ధమవుతోంది.

అందులో భాగంగా ఎన్నికల నగారా మోగింది తర్వాత జనసేన ముఖ్య నేతలతో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అత్యవసర భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున ఎన్నికలో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన 1200 మంది ఆశావహుల అంశం, లెఫ్ట్ పార్టీలకు కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. అదేవిధంగా ఈనెల 14న రాజమండ్రిలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పవన్‌కు నేతలు వివరించారు.

Related News