//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్....వచ్చే సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్....!

Category : state

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్న నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం కు మన నిరసనలు తెలపాలని నిర్ణయయించి, వచ్చే సోమవారం ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.

ఈమేరకు ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తెలియచెప్పారు. ఇంకా అయన మాట్లాడుతూ 16 వ తేదీన బంద్‌కు పిలుపునిస్తున్నామని, అయితే అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు.

అలాగే బంద్‌లు చేయాలని మా‌కు కోరిక కాదు, ప్రజల కోసం రోడ్డెక్కుతున్నాం అని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీక్ష ఉందన్నారు. ప్రజలంతా‌ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని లెఫ్ట్, హోదా సాధన సమితి పిలుపునిచ్చింది.

Related News