//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్... నెల్లూరులో ఉద్రిక్తత

Category : politics state

తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడంతో పాటు వారితో అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్... నెల్లూరులో ఉద్రిక్తత పోలీసులతో మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసే సమయంలో అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు, అనుచరులు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారందరినీ నిలువరించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు.