//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేనలోకి మాజీ స్పీకర్: షాక్ తిన్న కాంగ్రెస్ నేతలు...

Category : politics

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుమల వస్తున్నా సందర్భంలో మనోహర్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు.

రాష్ట్రము విడిపోయన నేపధ్యలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇతర పార్టీలలో చేరగా మనోహర్‌ మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు మనోహర్ జనసేనలోకి చేరుతుండటంతో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు శాసనసభ కి ఎన్నికయ్యారు. 2011లో అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో స్పీకర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్, మనోహర్ మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే అయన జనసేనలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మనోహర్ రాకతో జనసేనలో కొత్త ఉత్సహం మొదలైంది. నాదెండ్ల మనోహర్ షాక్ తో ఏపీ కాంగ్రెస్ నాయకులూ అయోమయంలో పడ్డారు. ఒక ప్రక్క కొత్త నాయకులూ చేరడంతో జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ఆనందంగా ఉన్నారు.

Related News