//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రౌడీ ఎమ్మెల్యే అరెస్ట్

Category : politics state

రౌడీ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రౌడీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీని యూపీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన మొహాలీ నగరంలో సంచలనం రేపింది. రూ.10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ తనను బెదిరించాడని మొహాలీ నగరంలోని సెక్టార్ 70కి చెందిన ఓ బిల్డరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన బీఎస్పీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీపై ఐపీసీ సెక్షన్ 386, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున సాయుధ పోలీసులను మోహరించి ఎమ్మెల్యే ముఖ్తార్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. గ్యాంగస్టర్ నుంచి రాజకీయనాయకుడిగా మారిన రౌడీ ఎమ్మెల్యే ముఖ్తార్ కు మెజిస్ట్రేట్ అమిత్ బక్షి రెండురోజుల పోలీసు కస్టడీకి పంపించారు.

బిల్డరును బెదిరించిన ఎమ్మెల్యేపై బెదిరింపులు, ఆయుధాల చట్టాన్ని ప్రయోగించామని మొహాలీ ఎస్పీ కుల్దీప్ సింగ్ చాహల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ముఖ్తార్ అహ్మద్ అన్సారీ మనవడైన ముఖ్తార్ అన్సారీ గతంలో పలు కేసులో జైలుకెళ్లారు. ఇతనిపై 45 క్రిమినల్ కేసులున్నాయి. గతంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, రామ్ సింగ్ మౌర్యాల హత్య కేసుల్లో నిందితుడు. 1995 నుంచి బహుజన సమాజ్ పార్టీలో చేరిన అన్సారీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Related News