//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ను కాద‌ని.. చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో టీడీపీలోకి ముద్ర‌గ‌డ చేరిక‌..!

Category : politics

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, కాపుల‌కు ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా.. వెంట‌నే అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. కాపు జాతికి అన్యాయం జ‌రిగితే రుకునేది లేదంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తుంటారు కూడా. అటువంటి వ్య‌క్తి ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మైపోయారు. అంతేకాకుండా, మొన్న‌టివ‌ర‌కు చంద్ర‌బాబుకు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడు చంద్ర‌బాబుకు స‌న్మానం చేస్తానంటూ చెబుతున్నాడు. ఇంత‌కీ ముద్ర‌గ‌డ‌లో అంత మార్పు రావ‌డానికి కార‌ణ‌మేంటో తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

ఇక అస‌లు విష‌యానికొస్తే, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగసిప‌డుతున్న స‌మ‌యంలో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పంచ‌న చేరిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, జ‌గ‌న్ స‌ల‌హా మేర‌కు తునిలో కాపు ఉద్య‌మం స‌మావేశంలో భాగంగా రైళ్ల‌కు నిప్పు అంటించారు. ఇలా జ‌గ‌న్‌తో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న బంధాన్ని కొన‌సాగించారు.

అయితే, వైఎస్ జ‌గ‌న్ త‌న పాదయాత్ర‌లో భాగంగా.. వైసీపీ అధికారంలోకి వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ప్ర‌స‌క్తే లేదంటూ తేల్చేశారు. దీంతో ఖంగుతిన‌డం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంతైంది. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం పెంచుకున్న ముద్ర‌గ‌డ త‌న ముఖాన్ని మీడియాకు చూపించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మ‌రోవైపు, త‌మ వ‌ర్గం త‌రుపున రాజ‌కీయాల్లో రాణిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేదు. ఇలా జ‌గ‌న్ కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌న‌ని తేల్చి చెప్ప‌డం.. ప‌వ‌న్ అధికారంలోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేక‌పోవ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆ క్ర‌మంలోనే, ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన ముద్ర‌గ‌డ త‌న స్వ‌రంలో చంద్ర‌బాబుపై బేస్ వాయిస్‌ను త‌గ్గించారు. అంత‌కు ముందు, వార్నింగ్‌లు, హెచ్చ‌రిక‌లు, డెడ్‌లైన్‌ల‌తో చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డ ప‌ద్మ‌నాభం.. తాజాగా, చంద్ర‌బాబుపై సాఫ్ట్ కార్న‌ర్ చూపించ‌డం అంద‌ర్నీ ఆలోచింప చేసింది. కాపుల‌కు ఒక్క చంద్ర‌బాబు మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌రు అంటూ మాట్లాడారు. చంద్ర‌బాబు కాపుల‌కు న్యాయం చేస్తే.. ప‌ది ల‌క్ష‌ల మంది కాపుల‌తో క‌లిసి చంద్ర‌బాబుకు స‌న్మానం చేస్తామంటూ చెప్పారు ముద్ర‌గ‌ద పద్మ‌నాభం. ఇలా చంద్ర‌బాబుపై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నాటి.. నేటి మాట‌ల‌ను విన్న రాజ‌కీయ విశ్లేష‌కులు.. అతి త్వ‌ర‌లో ముద్ర‌గ‌డ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Related News