//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోత్కుపల్లి కి సీరియస్ ..ఆందోళనలో కార్యకర్తలు ..!

Category : politics

టీడీపీ మాజీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆతరువాత ఆయనకి మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీచేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. అలాగే నేడు పోయింగ్ జరుగుతుండడం తో అయన అభిమానులు , కార్యకర్తలు కొంతమేర ఆందోళనకి గురౌతున్నారు .

Related News