//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఎంపీగా కాదు..ఎమ్మెల్యేగా పోటీ.. ఏ పార్టీ నుంచో తెలుసా..?

Category : politics

విభ‌జ‌న జ‌రిగితే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అన్న‌మాట మీద నాలుగేళ్ల‌పాటు నిల‌బ‌డ్డారు. ఇన్నాళ్లూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న ఈ మాజీ ఎంపీ ఇప్పుడు రాజ‌కీయాల వైపు అడుగులు వేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ఒట్టును గ‌ట్టుమీద పెట్ట‌బోతున్నార‌ట‌. ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పిల‌వ‌డే రాజ‌గోపాల్ టీడీపీలో చేర‌బోతున్నార‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతుంది.

మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అవ్వాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే, ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు. ఏ పార్టీలో చేర‌బోతున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారుతుంది. అయితే, టీడీపీ కండువా క‌ప్పుకుంటార‌నే టాక్ వినిపిస్తుంది. ప‌లుమార్లు సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌డంతో ఆయ‌న సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

ఇదే స‌మ‌యంలో కొన్ని స‌ర్వేలు నిర్వ‌హించి, ఆ స‌ర్వేల‌ను సీఎం చంద్ర‌బాబు ముందు ఉంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. దీంతో, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ టీడీపీలో చేరిక దాదాపు ఖాయ‌మైంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయాల నుంచి విర‌మించుకున్న ల‌గ‌డ‌పాటికి విజ‌య‌వాడ‌లోని త‌న వ‌ర్గంతో ఇప్ప‌టికీ ఆయ‌న‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. మ‌ళ్లీ ఇప్పుడు ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నార‌నే వార్త‌లు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవ‌రెన్ని స‌ర్వేలు నిర్వ‌హించినా ల‌గ‌డ‌పాటి నిర్వ‌హించే స‌ర్వేలో ఏమొచ్చింద‌నే విష‌యాల‌పైనే అంద‌రూ ఆస‌క్తి చూపుతున్నారు. ఆయ‌న చేసే స‌ర్వేపై అంద‌రికి న‌మ్మ‌కం క‌లిగేలా చేసుకున్నారు రాజ‌గోపాల్‌.

విభ‌జ‌న‌తో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఆయ‌న మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రావాల‌నుకుంటున్నారు. ఒక‌వేళ టీడీపీలో చేరితే మ‌ళ్లీ విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని ల‌గ‌డ‌పాటి భావిస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ నుంచి కేశినేని నాని ఎంపీగా ఉన్నారు. అయితే, నానిని త‌ప్పించి రాజ‌గోపాల్‌కు టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు సుముఖ‌త చూపారు. ఇదే విష‌యంపై ప‌లుమార్లు చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ట‌.

అయితే, టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ను పార్ల‌మెంట్‌కు కాకుండా, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది..? అన్న‌దానిపైనా టీడీపీలో చ‌ర్చలు జ‌రుగుతున్న‌ట్టు సమాచారం. అంతేకాకుండా, ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు టీడీపీ నేత‌ల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. పార్టీ ప్రయోజ‌నాల దృష్ట్యా ల‌గ‌డ‌పాటిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలా..? లేక ఎంపీగా పోటీ చేయించాలా..? అన్న అంశాల‌పై సీఎం చంద్ర‌బాబు నాయుడు పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించారు. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై చర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చిన త‌రువాత‌.. ఆ వివ‌రాల‌ను టీడీపీ అధిష్టానం మీడియాకు వెల్ల‌డించ‌నుంది.

Related News