Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

Category : state politics

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో రాజకీయవలసలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళి టీడీపీలో చేరారు. కర్నూలు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోడుమూరు అసెంబ్లీ సీటు ఆశించిన మురళి టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ గుడ్‌బై చెప్పారు. ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ సమక్షంలో సైకిలెక్కారు.

Related News