//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బ్రేకింగ్‌: కేసీఆర్ సొంత ఫ్లాష్ స‌ర్వేలో టీడీపీ గెలిచే స్థానాలు ఇవే..!

Category : politics

స‌ర్వే, ఫ్లాష్ స‌ర్వే. తెలంగాణ‌లో మ‌ళ్లీ స‌ర్వే. ఎన్నిక‌ల న‌గారా మోగింది. గెలుపు ఎవ‌రిద‌న్న‌దానిపై ఏదైన వార్తా సంస్థ చేయిస్తున్న స‌ర్వే అనుకుంటున్నారా..? కాదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయిస్తున్న స‌ర్వే. అది కూడా ఫ్లాష్ స‌ర్వే. ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న అభ్య‌ర్థుల‌కు సంబంధించిన స‌ర్వే. అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాల‌కు సంబంధించిన స‌ర్వే. గెలుపు గుర్రాలు ఎవ‌రో అన్న‌ది తెలుసుకునే స‌ర్వే. ఇప్ప‌టికే 105 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించేశారు. మ‌ళ్లీ స‌ర్వే ఏమిటి..? అది ఫ్లాష్ స‌ర్వే. అస‌లు ఎందుకీ స‌ర్వే అంటారా..? అలా అయితే మీరు ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వార్ వ‌న్ సైడ్‌గా ఉండాల‌ని భావిస్తున్నారు కేసీఆర్‌. ఆ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్షాలు కూడా ఊహించ‌ని విధంగా అంద‌రిక‌న్నా ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డ‌మే కాదు బిగ్ లిస్ట్‌తో బిగ్ షాక్ ఇచ్చేశారు. 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. కేవ‌లం 14 నియోజ‌క‌వ‌ర్గాల‌ను మాత్ర‌మే వ‌దిలిపెట్టారు. అందులో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు ఐదు ఉంటే మిగిలిన తొమ్మిది ప్ర‌తిప‌క్షాల స్థానాలు.

మ‌రోప‌క్క మ‌హాకూట‌మితో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇటు 105 మంది టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని కూడా మొద‌లు పెట్టేశాయి. మిగిలిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది మాత్రం కేసీఆర్ క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ, ఆ క్ర‌మంలో ప‌క్కా వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ట, టీఆర్ఎస్ అన్ని నియోజ‌క‌వర్గాల్లో కూడా అత్యంత కీల‌కం అని భావిస్తున్న కేసీఆర్ ఆ 14 చోట్ల బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌దానిపై స‌ర్వే చేయిస్తున్నార‌ట‌.

తాపీగా స‌ర్వే చేయ‌డానికి ఇది సాధార‌ణ‌మైన స‌మ‌యం కాదు. అందుకే ఫ్లాష్ స‌ర్వేకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఆ స‌ర్వే ఫ‌లితాల ఆధారంగానే 14 చోట్ల పార్టీ అభ్య‌ర్థులెవ‌రో ప్ర‌క‌టించేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. అయితే, కేసీఆర్ చేయించిన ఈ ఫ్లాష్ స‌ర్వే నివేదిక‌లో అంతు చిక్క‌ని విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, తెలంగాణ‌లోని దాదాపు 35 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ ఫ్లాష్ స‌ర్వేలో ప్ర‌జ‌లు తీర్పు తుది తీర్పునిచ్చారు. అంతేగాక‌, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల‌ను చిత్తు చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, త‌మ ఓటుతో వారికి బుద్ధి చెబుతామంటూ ప్ర‌జ‌లు ఫ్లాష్ స‌ర్వే కోసం కేసీఆర్ నియ‌మించిన ప్ర‌జ‌ల‌తో చెప్ప‌డం మ‌రో విశేషం.

అయితే, కేసీఆర్ ఫ్లాష్ స‌ర్వేలో టీడీపీ గెలుపొంద‌నున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య, వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి. హుసూర్‌న‌గ‌ర్‌, దేవ‌ర‌క‌ద్ర‌, కుత్బుల్లాపూర్‌, జ‌గిత్యాల అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థులు భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ స‌ర్వే తేల్చింది. అంతేగాక‌, న‌ర్సంపేట్, స‌న‌త్‌న‌గ‌ర్‌, తుంగ‌తుర్తి, స్థానాల్లోనూ టీడీపీ అభ్య‌ర్థులు సుమారు 37 వేల పై చిలుకు ఓట్ల‌తో విజ‌యం సాధిస్తార‌ని కేసీఆర్ స‌ర్వే పేర్కొంది.

అయితే ఆలేరు, పెద్ద‌ప‌ల్లి, వ‌న‌ప‌ర్తి, ఉప్ప‌ల్ వంటి ప్రాంతాల‌తోపాటు, హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని జూబ్లీహిల్స్‌, ఎల్బీన‌గ‌ర్‌, ముషీరాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి, ఖైర‌తాబాద్, కూక‌ట్‌ప‌ల్లి, రాజేంద్ర న‌గ‌ర్‌ వంటి అసెంబ్లీ స్థానాల్లోనే కాకుండా వ‌రంగ‌ల్ తూర్పు, జ‌డ్చ‌ర్ల‌, స‌త్తుప‌ల్లి, బోధ‌న్‌, ప‌టాన్ చెరువు, మిర్యాల‌గూడ‌, ములుగు, షాద్‌న‌గ‌ర్‌, కొత్త‌గూడెం, సిర్పూర్‌, నిజామాబాద్ రూర‌ల్‌, భూపాల‌ప‌ల్లి, ఖానాపూర్‌, ఖ‌మ్మం, జ‌హీరాబాద్‌, ఆర్మూర్ స్థానాల్లోనూ టీడీపీ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని కేసీఆర్ ఫ్లాష్ స‌ర్వే వెల్ల‌డించింది.