Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలిక జననాంగాన్ని బ్లేడ్ తో కోసి ,రేప్ చేసి వీడియో చిత్రీకరణ...బాలుడి ఘాతుకం

Category : state

హైదరాబాద్ నడిబొడ్డున బాలికను చిత్రహింసలకు గురి చేసి, బ్లేడ్తో ఒళ్లంతా గాయాలు చేసి, జననాంగం పైన కోసి అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా సదరు బాలుడి స్నేహితులు దానిని వీడియో చిత్రీకరించి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. మార్చి 2న జరిగిన ఘటన, బాలిక బాలికపై మిస్సింగ్ కేస్ ఫైల్ అవడంతో మహిళా దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. దేశ నిర్భయపై జరిగిన లైంగిక దాడిని నేటికీ మర్చిపోలేదు. మళ్లీ అటువంటి ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడం, ఈ ఘటనకు పాల్పడింది బాలురు కావడం సమాజాన్ని షాక్ కి గురి చేస్తుంది ..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఒక బాలుడు పశువులా ప్రవర్తించాడు. అతని స్నేహితులు రాక్షస ఆనందం పొందారు. ఒక బాలికను వివస్త్రను చేసి, ఇష్టమొచ్చినట్టు కొట్టి, ఒళ్లంతా బ్లేడుతో కోసి, జననాంగం ని సైతం గాయపరిచి మరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు బాధతో బాలిక ఆర్తనాదాలు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో వీడియో చిత్రీకరిస్తూ బాలిక శరీర భాగాలను చూపాలంటూ వేధింపులకు గురిచేశారు.లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో చంద్ర నగర్ కాలనీ, లిబర్టీ, ఆయిల్ సీడ్స్ కాలనీకి చెందిన కొందరు బాలురు రోజు గంజాయి తాగుతూ ఉంటారు. వీరితో సన్నిహితంగా మెలిగిన ఒక బాలికను సైతం గంజాయి కి అలవాటు చేశారు సదరు బాలురు. గంజాయి మత్తులో ఈ నెల 2న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ బాలుడు ఆమెపై అత్యాచారం చేయగా ఆ దృశ్యాలను స్నేహితులు చిత్రీకరించి, యు ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు అంతేకాకుండా ఆ వీడియోను మరికొందరు స్నేహితులకు షేర్ చేశారు.

ఇక ఈ విషయం తెలిసిన బాలిక వీడియో ను తొలగించాలని నిందితుడిని పదేపదే ప్రాధేయ పడుతూ వచ్చింది. వీడియో తొలగించాలంటే డీబీఆర్ మిల్స్ వద్ద తనను కలవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు సదరు బాలుడు. ఇంట్లో స్నేహితులను కలవడానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో బాలిక కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన గాంధీనగర్ పోలీసులు బాలికను గుర్తించి అసలు విషయం తెలుసుకున్నారు. బాలికపై జరిగిన లైంగిక దాడి, దారుణమైన సంఘటన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశారు. నిందితులకు దేహశుద్ధి చేసి, అతని ఫోన్ లోని వీడియో లను డిలీట్ చేశారు స్థానికులు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లుగా వైద్యులు తెలిపారు.