//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌లోకి గ‌ద్ద‌ర్‌.. డేట్ ఫిక్స్‌..!

Category : politics

గ‌ద్ద‌ర్‌, తెలంగాణ‌లో ఈ పేరు ఓ పెను సంచ‌ల‌నం, ఆయ‌న పేరు చెబితే కాలు క‌ద‌ప‌ని తెలంగాణ వాది ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా మ‌న‌సుకు హ‌త్తుకుంటాయి ఆయ‌న నోటి నుంచి జాలువారిన పాట‌లు. ఆయ‌న ర‌చించి పాడిన పాట‌ల్లో వీర తెలంగాణ‌మా.. పోరు తెలంగాణ‌మా మంచి పేరు తెచ్చింది. అంతేకాకుండా, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో సామాన్యుడ్ని సైతం ఉద్య‌మం వైపు న‌డిచేలా చేసింది ఆ పాట‌. ఆ పాట‌లో అంత అర్థం ఉంది.

అంతేకాదు, గ‌ద్ద‌ర్‌పై తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం.. అతా ఇంతా కాదు. ఆయ‌న ఎంత‌టి సామాన్యుడి ఇంటికైనా వెళ్ల‌గ‌ల‌డు. అలాగే, ఎంత పెద్ద రాజ‌కీయ నేత ఇంటికైనా వెళ్ల‌గ‌ల‌డు. అటువంటి వ్య‌క్తిత్వం గ‌ద్ద‌ర్‌ది. తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న అందించిన గానం, ఆయ‌న చేసిన పోరాటం అద్భుత‌మ‌ని ఇప్ప‌టికే నిజ‌మైన తెలంగాణ పోరాట యోధులు కొనియాడుతుంటారు.

అటువంటి గ‌ద్ద‌ర్ ఇప్పుడు నైరాశ్యంలో ఉన్నాడు. తాము ఎంతో క‌ష్ట‌ప‌డి, కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్ర‌జ‌లు ఇప్పుడు క‌ష్టాల్లో ఉండ‌టాన్ని చూడ‌లేకున్నాడు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉండ‌టానికి కేసీఆర్‌ ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెబుతున్నాడు గ‌ద్ద‌ర్‌. ఆ ప‌రిస్థితులే త‌న‌ను రాజకీయాల్లోకి ర‌మ్మ‌ని పిలుస్తున్నాయ‌ని ఇటీవ‌ల ఓ మీడియా స‌మావేశంలో గ‌ద్ద‌ర్ చెప్పిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, తెలంగాణ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గ‌ద్ద‌ర్ కేసీఆర్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న విష‌యం తెలిసిందే. కేసీఆర్‌పై ఉన్న ఆ వ్య‌తిరేక‌తే.. ఇప్పుడు గ‌ద్ద‌ర్‌ను మ‌హాకూట‌మిలో చేరేలా చేస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌ని చెప్పిన గ‌ద్ద‌ర్ అతి త్వ‌ర‌లో మ‌హాకూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య కండువా క‌ప్పుకోనున్నారు. అయితే, మ‌హాకూట‌మి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా గ‌జ్వేల్ నుంచి గ‌ద్ద‌ర్ పోటీ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Related News