మొన్న జరిగిన ఉగ్రదాడి తోనే ఇంకా భయం నుండి కోలుకొని జమ్మూ కాశ్మీర్ మరోసారి వణికింది. ఒకపక్క 40 మంది జవాన్ల మృతి ని జీర్ణించుకోలేని జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్లో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2 గా నమోదైంది. భూ ప్రకంపనలకు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.