Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ దర్శక,నిర్మాత విజయ బాపినీడు కన్ను మూత....!

Category : movies

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మ్యాగ్జిన్ ఎడిటర్ తెలుగు సినీ పరిశ్రమకు పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఆయన ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపీనీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. మొత్తం 22 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.ఎంతో మంది ప్రముఖులను రాష్ట్రానికి అం‍దించిన సీఆర్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు.ఎక్కువగా చిరంజీవి, శోభన్‌ బాబు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. బొమ్మరిల్లు, విజయ, ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు.

తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. తెలుగులో 22 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు చివరి చిత్రం 1998లో తెరకెక్కిన ‘కొడుకులు’.

ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఓ సినీ వేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరును డైరెక్ట్ చేయాలనుందన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లను అందించటంతో పాటు చిరంజీవి టాప్‌ స్టార్‌గా ఎదగటంలో కీలక పాత్ర పోషించిన విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ విషయం తెలిసిన తరువాత చాల మంది సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి ఆయన ఇంటికి తరలి వెళుతున్నారు.

Related News