Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు మరో సంచలనం .... ఇదే

Category : state politics

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలతో ప్రజల మద్దతు కూడగడుతున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహంలో భాగంగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అన్ని వర్గాల వారికి ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉద్యోగుల పై దృష్టి సారించారు.

పింఛన్లు 2 వేలకు పెంపు, అలాగే డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.10వేల ఆర్ధిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పినట్టయింది. వారికి 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో రాష్ట్ర ఖజానాపై రూ. 6వేల 884 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే చాలా కాలంపాటు పెండింగులో ఉన్న ఐఆర్ పై కూడా క్యాబినెట్ లో చర్చించి ఫైనల్ నిర్ణయానికి రానుంది ఏపీ ప్రభుత్వం.

ఇదిలావుంటే పెన్షన్ రెట్టింపు, డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సాయం, తాజాగా ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇవ్వడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా రానున్న ఎన్నికల్లో తమకు అనుకూల ఓటు బ్యాంకుగా మారుతుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల సమయంలో చంద్రబాబు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు రాష్ట్ర ఖజానా పైన పెను భారాన్ని మోపుతున్నాయి. ఒకపక్క చంద్రబాబు నిర్ణయాల నేపథ్యంలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ప్రజలు అవాక్కయ్యేలా హామీలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఆచరణ సాధ్యం కాని హామీలతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రజలను మెప్పించడమే దేయ్యంగా పని చేస్తున్నారు.