//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీఆర్ఎస్ కోసం బీజేపీ వింత ప్రచారం ... రీజన్ అదేనా

Category : politics

తెలంగాణాలో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముందస్తు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల ప్రచారం కూడా ముందే ప్రారంభించారు. ఆ క్రమంలో కేసీఆర్ పార్టీ అయితే మరింత దూకుడుగా ప్రచారం చేస్తుంది అని అంటున్నాయి మీడియా వర్గాలు. ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఎలా అయినా ఈ ఎన్నికల్లో గట్టెక్కాలి అని భావిస్తున్న నేపధ్యంలో ప్రజలు నిలదీసినా సరే సంయమనంతో ఉండాలని కూడా గులాబీ బాస్ సూచించారు. Breaking News : BJP strangely campaign for TRS

సరే ఇదిలా ఉంటే రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం తెలంగాణాలో కేసీఆర్ గెలుపు కోసం బీజేపీ ఆవిరైపోతుందేమో అని టాక్ వినిపిస్తుంది. ఎలా అయినా కేసీఆర్ ను గెలిపించాలి అని తాను త్యాగం చేస్తుందని అనుకుంటున్నారు. అసలు కేసీఆర్ గెలుపుతో బీజేపీకి వచ్చే లాభం ఏంటి? నష్టం ఎంత? అని కాస్త క్లుప్తంగా ఆలోచిస్తే, అన్ని పార్టీల మాదిరిగా కాకుండా బీజేపీ ఇక్కడ చాలా వింత ప్రచారం చేస్తుంది.అదేంటో తెలుసాBreaking News : BJP strangely campaign for TRS

“గెలిచేలా ఉంటేనే బీజేపీకి ఓటు వెయ్యండి లేకపోతే టీఆర్ఎస్ కు వెయ్యండి” అంటూ డైరెక్ట్ గానే గులాబీ పార్టీని గెలిపించాలి అన్నది బీజేపీ వ్యూహం. అయితే టీఆర్ఎస్ కూడా ముత్తైదువుల వాయినం లాగా, “ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మా వాయినం” అన్న విధంగా ఎలా అయినా బీజేపీ గెలవాలి అన్న సీట్లలో వీక్ కాండిడేట్లను పెట్టి మరీ బీజేపీకి అండగా నిలిచింది. అయితే ఈ ఇచ్చి పుచ్చుకునే క్రమంలో బీజేపీకి నష్టం ఏంటి అంటే? ఈ ఎన్నికల్లో దూకుడుగా వెళ్ళాలనుకున్న పార్టీ దూకుడు తగ్గింది. పార్టీ రాష్ట్రంలో ఎదిగే అవకాశం కోల్పోతుంది.తద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకు ఎన్నికల తరువాత చెల్లా చెదురు అయ్యి, పార్టీ నాయకులు, క్యాడర్ మనోధైర్యం దెబ్బ తింటుంది. ఏదో కాస్తో కూస్తో ప్రజలకు బీజేపీ మీద ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది.Breaking News : BJP strangely campaign for TRS

అయితే ఇలా చెయ్యడం వల్ల బీజేపీకి లాభం గమనిస్తే ఒంటరిగా గెలవలేరు కనుక కేసీఆర్ కు మద్దతుగా నిలిస్తే తమ బద్డ శత్రువులు అయిన కాంగ్రెస్ – టీడీపీ పార్టీలను దెబ్బ కొట్టవచ్చు. మరో పక్క కేసీఆర్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. రానున్న 2019 ఎన్నికల సమరంలో కేసీఆర్ లాంటి వాడిని తమ పక్కన పెట్టుకుంటే, రేపు లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా కేసీఆర్ పార్టీ తమకు అండగా నిలుస్తుంది అన్నది బీజేపీ పార్టీ ఆలోచన. మరి మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికి బీజేపీ చేసుకున్న ఒప్పందం ప్రకారం లోపాయికారిగా కమల దళం గులాబీ దళానికి కూడా ప్రచారం చేస్తుంది.Breaking News : BJP strangely campaign for TRS

Related News