//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ కేబినెట్‌లోకి కొత్త‌గా చేర‌నున్న వారు వీరే..!

Category : politics

ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఆదివారం నాడు AP Cabinet ను విస్త‌రించ‌నున్నారు ముఖ్య‌మంత్రి నారా Chandrababu నాయుడు. ఉండ‌వ‌ల్లిలో జ‌ర‌గ‌నున్న ప్ర‌జా వేదిక కార్య‌క్ర‌మంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే, ఎవ‌రికి స్థానం ద‌క్కుతుందోన‌ని ఆశావ‌హులు ఎదురుచూస్తుండ‌గా ఇద్ద‌రు కొత్త వారికి క్యాబినెట్‌లో స్థానం ద‌క్క‌నుంద‌ని తెలుస్తుంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను ఒక స్ట్రాట‌జీ ప్ర‌కార‌మే చేస్తున్నార‌ని తెలుగుదేశం నేత‌లు చెబుతున్నారు. breaking news ap cabinet expansion tomorrow

కేబినెట్ విస్త‌ర‌ణ‌తోపాటు ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల శాఖ‌లు మారే అవ‌కాశం ఉంది. సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద ఉన్న వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌ను మ‌రో సీనియ‌ర్ మంత్రికి, అలాగే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి వ‌ద్ద ఉన్న దేవాదాయ‌శాఖ‌ను మ‌రో మంత్రికి కేటాయించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతం AP Cabinet లో 24 మంది స‌భ్యులు ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జ‌ర‌గ‌నున్న కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఈ రెండు వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్నారు. breaking news ap cabinet expansion tomorrow

ఆ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మావోయిస్టు దాడిలో మృతి చెందిన అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు కుమారుడు శ్రావ‌ణ్‌కు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చోటు ఇవ్వాల‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. అలాగే, మైనార్టీ కోటాలో మండ‌లి చైర్మ‌న్ ఫ‌రూక్‌కు కేబినెట్‌లో స్థానం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కిడారి శ్రావ‌ణ్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో టీడీపీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ శ్రావ‌ణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందే స‌మ‌యం లేదు. ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం లేదు. ఎమ్మెల్సీని చేయాల‌న్నా ఖాళీలు లేవు. ఈ నేప‌థ్యంలో శ్రావ‌ణ్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చి ఏజెన్సీలో TDP వ‌ర్గాల్లో ఉత్సాహాన్ని నింపాల‌నేది చంద్ర‌బాబు ప్లాన్‌గా పార్టీ శ్రేణులు చెబుతున్నారు.breaking news ap cabinet expansion tomorrow