Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్ : వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.!

Category : politics

ఏపీ రాజకీయ వర్గాల్లో సరిగ్గా ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున కలకలం రేపిన సంఘటన ఏమన్నా ఉంది అంటే అది వై ఎస్ జగన్ సొంత బాబాయ్ అయినటువంటి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యా ఘటనే అని చెప్పాలి.వివేకా స్వగృహంలోనే ఈ దారుణమైన ఘటన జరగడం అందులోనే అనేక రకాల అనుమానాలు ఇప్పటికి వీడకపోవడంతో ఈ హత్య పెద్ద మిస్టరీగా మారిపోయింది.ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో షాకింగ్ అంశం బయటకు వచ్చింది.

కేసులో భాగంగా హత్యా ఘటన జరిగిన రోజున ఆ ఇంటి వాచ్ మెన్ గా ఉన్నటువంటి రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు గత కొన్ని రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారట.ఇలా అదుపులోకి తీసుకొని హత్యకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నల ద్వారా విచారించి అతనికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కావాలని పులివెందుల కోర్టును కోరగా అందుకు కోర్టువారు రంగయ్య అనుమతి మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు వార్హలొస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి నివేదికను త్వరలోనే అందజేస్తాని పోలీసులు తెలిపినట్టు సమాచారం.

Related News