//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ ... ప్రత్యేక హోదా కోసం కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేసిన లాయర్

Category : state politics

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరోమారు ఉద్యమం మొదలైంది. ఒకపక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏపీలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతునన్ని రోజులు వివిధ రూపాలలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలియ చేయాలని అధికార పార్టీతో పాటు, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు సైతం కేంద్రం పై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఉద్యమం మళ్లీ రగిలింది.

ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో లాయర్ అనిల్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానికి లేఖ రాశాడు. అలాగే నుదుటిపై ప్రత్యేక హోదా ఇవ్వాలని రాసుకుని కోర్టు హాల్ లోకి వచ్చి అందరు చూస్తుండగానే ఘటనకు పాల్పడ్డాడు. అనిల్ కుమార్ ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానాలకైనా వెనుకాడేది లేదని ఈ ఘటనతో తెలియజేసే ప్రయత్నం చేశారు అనిల్ కుమార్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనిల్ కుమార్ ను రక్షించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

Related News