//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాంగ్రెస్‌కు ఆరుగురు సీనియ‌ర్ నేత‌లు రాజీనామా..!

Category : politics

ఏదో అనుకుంటే. .ఇంకేదో అవుతుందే అని నీర‌స రాగంలో విల‌పిస్తున్నార‌ట ఏపీ Congress నేత‌లు. ఏదేదో జ‌రుగుతుంద‌ని ఊహించుకున్నార‌ట‌. కానీ, ఇంకేదేదో జ‌రిగిపోతుంద‌ట‌. జ‌రుగుతుంది అర్ధ‌మ‌వుతుంది. ఎలా ఆపాలో తెలియ‌డం లేదట‌. అస‌లే కోమాలో ఉన్న పార్టీ ఆ పైన ఊహించ‌ని రుస షాక్స్‌. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌డం ఎలా అన్న‌ది పెను స‌వాల్‌గా మారింద‌ట ఏపీ Congress పెద్ద‌ల‌కు. నిండా మునిగాక చ‌లేంటి..? అని ప్ర‌ద్య‌ర్ధి పార్టీలు విసిరే సెటైర్లు ప‌క్క‌న పెడితే అస‌లు ఏపీ కాంగ్రెస్‌కు వ‌చ్చిన కొత్త క‌ష్ట‌మేంటి..?

2014 నుంచి ఏపీలో Congress పార్టీ కోమా స్థితిలోనే ఉంది. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు ఎలాంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఇటు చూస్తే 2019 వ‌చ్చేస్తోంది. నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల కేంద్రంగా కూడా ఏపీ కాంగ్రెస్ పెద్ద‌లు పెద్ద‌గా హోప్స్ పెట్టుకోలేదట‌. ఈ నేప‌థ్యంలో Congress , టీడీపీ మ‌ధ్య పాజిటివ్ వైబ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో పొత్తులు పెట్టుకునే దిశ దాటి జాతీయ స్థాయిలో క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకునేదాక ఆ పాజిటివ్ వైబ్రేష‌న్స్ ఇరు పార్టీల‌ను ద‌గ్గ‌ర చేశాయి.

ఏపీలో అత్యంత బ‌ల‌మైన పార్టీ టీడీపీ. అందులోనూ ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీ. అలాంటి టీడీపీతో స్నేహం వ‌ల్ల పార్టీ తిరిగి బ‌లోపేతం అవుతుంద‌ని ఏపీ Congress పెద్ద‌లు భావించార‌ట‌. కానీ, ఊహించ‌ని విధంగా సీన్ రివ‌ర్స్ అవ‌డంతో ఇప్పుడు కింక‌ర్త‌వ్యం బోధ‌ప‌డ‌క కాంగ్రెస్ కండువాలు ఆందోళ‌న చెందుతున్నాయ‌ట‌. చంద్ర‌బాబు, రాహుల్ భేటీ ముగిసిన త‌రువాత Congress కు గుడ్‌బై చెప్పేశారు వ‌ట్టి వ‌సంత‌కుమార్‌.

అస‌లు చేరిక‌లే లేని ప‌రిస్థితి. ఎవ‌రికి పార్టీ కండువా క‌ప్పుదామా.. అని ఎదురు చూపులే త‌ప్ప Congress కు జై కొడుతూ పార్టీలోకి జంప్ చేసే నేత‌లు క‌నిపించ‌డం లేద‌ట‌. ఈ స‌మ‌యంలో ఉన్న కొద్దిమంది నేత‌లు కూడా పార్టీ వీడితే ప‌రిస్థితి ఏంట‌న్న క‌ల‌వ‌రం ఏపీ కాంగ్రెస్‌ను షేక్ చేస్తుంద‌ట‌. వ‌ట్టి ఎపిసోడ్ ఇలా ముగిసిందో లేదో.. నేను సైతం అంటూ సీ రామ‌చంద్ర‌య్య అదేబాట ప‌ట్టారు. Congress కండువా తీసేశారు. ఇక‌పై ఎవ‌రు పార్టీని వ‌దిలి వెళ‌తారు వాళ్ల‌ను ఎలా ఆపాలి అన్న‌ది పెద్ద టాస్క్‌గా మారింద‌ట ఏపీ కాంగ్రెస్ పెద్ద‌ల‌కు.

ఎన్నో సంక్షోభాల‌ను చూసిన Congress కు ఏపీలో ప‌రిస్థితి మాత్రం పెద్ద షాకే ఇచ్చింద‌ట‌. కోలుకోలేని స్థితిలో క‌నిపించిన పార్టీని ఎలాగైనా బ‌లోపేతం చేసే ఉద్దేశంతో పార్టీ వీడి త‌ట‌స్థంగా ఉన్న నేత‌ల‌ను తిరిగి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాల‌ను కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లాంటి నేత‌లు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నారు. మ‌రో వైపు 2019లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని ఎలాంటి పొత్తు పెట్టుకోకూడ‌ద‌ని తాత్కాలికంగా ఈ వ్యూహం వ‌ల్ల లాభం క‌నిపించ‌క‌పోయినా 2020 నాటికి పార్టీ బోల‌పేతం కావ‌డానికి ఉపయోగ‌ప‌డుతుంద‌న్న వ్యూహాల‌కు కూడా ఏపీ కాంగ్రెస్ పెద్ద‌లు ప‌దును పెట్టారు. ఇలా పార్టీని బలోపేతం చేయ‌డానికి కిందామీదా ప‌డుతున్న వేళ టీడీపీతో స్నేహం ఒక్క‌సారిగా పార్టీలో జోష్ నింపుతుంద‌ని భావిస్తే అది కాస్తా.. రివ‌ర్సు అయిందా అన్న ప్ర‌శ్న ఇప్పుడు వేధిస్తుంద‌ట‌.

అటు చూస్తే మెగాస్టార్ చిరంజీవి కొంత కాలంగా పార్టీలో యాక్టివ్‌గా లేరు. అన్న‌య్య త‌మ్ముడు పెట్టిన జ‌న‌సేన‌కు జై కొట్ట‌డం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటు చూస్తే వ‌ట్టి వ‌సంత‌కుమార్ సీ రామ‌చంద్ర‌య్య పార్టీకి రామ్ రామ్ చెప్పేశారు. మ‌రింత మంది నేత‌లు అదేబాట ప‌డితే మ‌రింత సంక్షోభం త‌ప్ప‌ద‌న్న ఆందోళ‌న ఏపీ కాంగ్రెస్‌ను వెంటాడుతోంద‌ట‌. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా ఆంధ్రాలో Congress ప్ర‌భావం పెద్ద‌గా లేద‌ని తేల్చి చెప్పేస్తున్నారు. జాతీయ స్థాయిలో చారిత్ర‌క అవ‌స‌రం అయింది కాబ‌ట్టే కాంగ్రెస్తో క‌లిసి ప‌ని చేయాల‌న ఇనిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. పార్టీ వీడి త‌ట‌స్థంగా ఉన్న నేత‌ల‌ను ఆక‌ర్షించ‌డం త‌రువాత.. ఇప్పుడు మిగిలిన కొద్ది మంది సీనియ‌ర్లు జారిపోకుండా చూసుకోవ‌డం ఎలా అన్న‌ది ఏపీ Congress కు పెద్ద స‌వాల్‌గా మారింద‌ట‌.