Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ సోమిరెడ్డి రాజీనామా..

Category : state politics

అధికార తెలుగుదేశం పార్టీ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల వరకు తాము ఇంట్లో చేతులు కట్టుకుని కుర్చోమని ఎన్నికల సంఘం ఆదేశిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము ఎన్నికల కోడ్ ను ఉళ్లంగించకుండా కట్టుబడే ఉన్నామని అన్నారు. అధికార ప్రభుత్వానిది నిరంతర ప్రక్రియని, ప్రజల పట్ల బాధ్యత నిర్వహించడం తమ విధి అని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ప్రజలు తమకు అధికారం ఐదు సంవత్సరాలు ఇచ్చారని తమ పదవికి గడువు ఇంకా జూన్ ఐదు వరకు ఉందని స్పష్టం చేశారు. తాము ప్రజలకు కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఓటర్లను ప్రభావితం చేయలేదని ఇంతకుముందే ప్రదేశపెట్టిన పథాకలతో సమీక్ష నిర్వహిస్తున్నామని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

ఇటీవలే కురిసిన వడగండ్ల వర్షానికి రైతులు పండించిన ధాన్యం మొత్తం తడిసిపోయిందని దానిపై సర్వే చేయించాలని అన్నారు. ఆ సర్వే ద్వారా నష్టపోయిన రైతులకు సహాయం అందించాలని అన్నారు. ఈ పనులన్ని తానే చేయాలని అన్నారు. అందుకే తన శాఖకు సంబంధించి నాలుగు ఐదు రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరం అయితే సుప్రీంకోర్టుకు అయినా వేళ్తామని స్పష్టం చేశారు మంత్రి సోమిరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే వెలుబడిన ఇంటర్ ఫలితాల వల్ల సుమారు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దీనికి ఎన్నికల కమీషన్ సమాధానం చెబుతుందా లేక ప్రభుత్వం సమాధానం చెబుతుందా అని ప్రశ్నించారు.