Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ ప్రజలకు శుభవార్త అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు..

Category : state politics

వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. .అలాగే ఇది ఏపీ ప్రజలకు శుభవార్త అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు ...కేసీఆర్ మద్దతు ఇచ్చిన వాళ్లు గెలిచిన దాఖలాలు లేవన్నారు. పాలకొల్లు ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. ‘‘ఇంకొక శుభవార్త ఏంటంటే..

కేసీఆర్ సపోర్ట్ చేస్తే ఎవరూ గెలవరు. అది గుర్తుపెట్టుకోండి. అది మనకు శుభసూచకం. 2014లో జగన్ అఖండ మెజార్టీతో గెలుస్తారని కేసీఆర్ చెప్పారు. ఏం జరిగిందో తెలుసు. తానొకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలుస్తుంది. మీరు జగన్‌ను తలిస్తే.. యాదాద్రి నరసింహుడు, వెంకన్న మరొకటి తలుస్తున్నారు. మీరు గొప్పగొప్పోళ్లు కావొచ్చు. భగవంతుడు, తల్లి, అల్లా, ఈశ్వరుడు ముందు మీరు చాలా చాలా చిన్నోళ్లు. తగ్గి ఉండటం నేర్చుకోండి. ప్రకృతి ముందు అందరూ తలవొంచుకోవాలి.

అహంకారంతో రెచ్చిపోయిన హిరణ్యకశిపుడు లాంటి వారిని స్తంభం చీల్చుకు వచ్చి మరీ నరసింహుడు సంహరించాడు’’ అంటూ కేసీఆర్, జగన్‌లపై వాగ్బాణాలు సంధించారు