Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫైనల్ గా కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్థులు వీళ్ళే... !

Category : state politics

త్వరలో తెలంగాణాలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ తెరాస పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, మహేందర్‌రెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఇన్నిరోజులు ఎదురుచూపులు చూసిన కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంది.

అభిప్రాయం సేకరణ నివేదికను పరిశీలించిన ఉత్తమ్ కుమార్, ఇతర ముఖ్య నేతలు నలుగురి పేర్లను ఫైనల్ చేసుకున్నారు.నల్గొండ స్థానానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇనగాల వెంకట్రామిరెడ్డిలను ఖరారు చేసిన కాంగ్రెస్ రంగారెడ్డి స్థానానికి మాత్రం ఇద్దరినీ బరిలో నిలపాలని నిర్ణయించుకుంది. వారే సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లేదా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. వీరిని ముందుగా నామినేషన్లు దాఖలు చేయమన్న అధిష్టానం సామినేషన్ల ఉపసంహరణ నాటికి ఇద్దరిలో ఎవరు బరిలో ఉండాలనేది నిర్ణయిస్తామని అభ్యర్థులకు తెలిపిందట.

Related News