Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రగిరి లో రీ- పోలింగ్ ఏ పార్టీ అనుకూలం కానుంది..... టీడీపి వర్సెస్ వైసీపీ గెలుపు ఎవరిది....?

Category : state politics

ఏపిలో మరోసారీ రీ పోలింగ్ జరగనుంది.ఈ రీ-పోలింగ్ ఎన్నికలకు వేదికైంది చంద్రగిరి నియోజకవర్గం. చంద్ర గిరి లోని ఐదు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

పులివర్తిపల్లి (బూత్ నెం.104),వెంకట్రామపురం (బూత్ నెం.313),

కొత్త కండ్రిగ (బూత్ నెం.316), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), లో రీ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించలేకపోయారని, వైసీపీ సానుభూతిపరులు పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా టీడీపీ అడ్డుకుందంటూ చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే, ఇక్కడ రీ పోలింగ్ నిర్వహిస్తే ఏ పార్టీ కి ప్లస్....?ఏ పార్టీ కి మైనస్....? అవుతుందనే చర్చ సర్వత్రా మొదలైంది. చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి పులవర్తి నాని పోటీ చేస్తున్నారు.

రీ పోలింగ్ జరిగే ఐదు పోలింగ్ కేంద్రాల్లో మూడు టీడీపీకి అనుకూలమైనవి గా తెలుస్తోంది. ఒకటి వైసీపీకి అనుకూలంగా ఉండబోతుంది. ఐదో పోలింగ్ బూత్ మాత్రం రెండు పార్టీలకు సమాన బలంగా ఉంది. కమ్మపల్లిలో రెండు బూత్‌లు, పులవర్తి పల్లి టీడీపీకి అనుకూలంగా ఉండేవని.కొత్త కండ్రిగ వైసీపీ వైపు మొగ్గుచూపే ప్రాంతం. ఇక వెంకటరామాపురం మాత్రం టీడీపీ, వైసీపీలకు సరి సమాన బలాలు గా ఉన్నాయి. ఈ క్రమంలో రీపోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది..? ఎవరికి మైనస్ అవుతుంది..? అనే చర్చ జోరుగా సాగుతోంది. రీ పోలింగ్ తేదీ కూడా ఖరారు కావడంతో అప్పుడే గ్రామాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు రెండు పార్టీల నేతలు. ఇటీవల ఏపీలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లో రీ పోలింగ్ జరగనున్నది.